Mamchimelu galigide maanavachchunaa

మంచిమేలు గలిగితే మానవచ్చునా
Language

(॥పల్లవి॥)
మంచిమేలు గలిగితే మానవచ్చునా
యెంచక చేకొనవయ్య ఇంటిదాన నేను

(॥మంచి॥)
యిన్నియు నేరుచు నాపె యెగ్గుసిగ్గులేని దాపె
వన్నెల నింకా నాపెకు వలవవయ్యా
మన్ననతోదాన నేను మానాపతిని నేను
వున్నతిఁ దొల్లే సతమైవున్నదాని నేను

(॥మంచి॥)
యేమైనాఁ జేసు నాపె యెమ్మెలెరగని దాపె
ప్రేమతో నాపె నింటికి బిలువవయ్యా
నీమాటలోదాన నేను నిగర్వపుదాన నేను
కామించి నీ కెప్పుడును గలదాన నేను

(॥మంచి॥)
పనిలేనిపని దాపె పంతములొల్లనిదాపె
ననుపున బాసలిచ్చి నమ్మించవయ్యా
చనవరిదాననేను జట్టిగొన్నదాననేను
యెనసితిని శ్రీవేంకటేశ యిట్టె నేను

(||pallavi||)
maṁchimelu galigide mānavachchunā
yĕṁchaga segŏnavayya iṁṭidāna nenu

(||maṁchi||)
yinniyu nerusu nābĕ yĕggusigguleni dābĕ
vannĕla niṁkā nābĕgu valavavayyā
mannanadodāna nenu mānābadini nenu
vunnadim̐ dŏlle sadamaivunnadāni nenu

(||maṁchi||)
yemainām̐ jesu nābĕ yĕmmĕlĕragani dābĕ
premado nābĕ niṁṭigi biluvavayyā
nīmāḍalodāna nenu nigarvabudāna nenu
kāmiṁchi nī kĕppuḍunu galadāna nenu

(||maṁchi||)
panilenibani dābĕ paṁtamulŏllanidābĕ
nanubuna bāsalichchi nammiṁchavayyā
sanavaridānanenu jaṭṭigŏnnadānanenu
yĕnasidini śhrīveṁkaḍeśha yiṭṭĕ nenu