Mamchigaalamaaya maruni raajyaana

మంచికాలమాయ మరుని రాజ్యాన
Language

(॥పల్లవి॥)
మంచికాలమాయ మరుని రాజ్యాన
కొంచక యీతనిఁ గొనియాడరే

(॥మంచి॥)
సరసమాడఁగఁ జవులు వుట్టెను
గరిమ నావిభుఁ గంటిరటే
తెరదియ్యఁగానే తేనెమోవీ నూరె
కరుణ నామీదఁ గలిగెనే

(॥మంచి॥)
కానుక లియ్యఁగఁ గాంక్షలు వుట్టెను
వీనినేరుపులు వింటిరటే
నానుపుఁజెమట నవ్వులు రేఁచెను
మానక నిన్నిట్టె మరిగెనే

(॥మంచి॥)
పూవుల వేయఁగఁ బొందులు గూడెను
శ్రీవేంకటేశు మెచ్చితిరటే
చేపట్టి తియ్యఁగ చెలఁగెఁ గళలు
వానితో నాకిట్టె వలచెనే

(||pallavi||)
maṁchigālamāya maruni rājyāna
kŏṁchaga yīdanim̐ gŏniyāḍare

(||maṁchi||)
sarasamāḍam̐gam̐ javulu vuṭṭĕnu
garima nāvibhum̐ gaṁṭiraḍe
tĕradiyyam̐gāne tenĕmovī nūrĕ
karuṇa nāmīdam̐ galigĕne

(||maṁchi||)
kānuga liyyam̐gam̐ gāṁkṣhalu vuṭṭĕnu
vīninerubulu viṁṭiraḍe
nānubum̐jĕmaḍa navvulu rem̐sĕnu
mānaga ninniṭṭĕ marigĕne

(||maṁchi||)
pūvula veyam̐gam̐ bŏṁdulu gūḍĕnu
śhrīveṁkaḍeśhu mĕchchidiraḍe
sebaṭṭi tiyyam̐ga sĕlam̐gĕm̐ gaḽalu
vānido nāgiṭṭĕ valasĕne