Mamchide nee janmamu maguvalalo nellaa

మంచిదె నీ జన్మము మగువలలో నెల్లా
Language

(॥పల్లవి॥)
మంచిదె నీ జన్మము మగువలలో నెల్లా
పెంచకె నీ కన్నులు పెద్దలాయఁగదవే

(॥మంచి॥)
మొక మిచ్చమాఁటలే మునుకొని ఆడియాడి
వెకలివైతివిగదె వెలఁదీ
విక విక నవ్వి నీవు విభునిఁ జిమ్మిరేఁచఁగా
చికురము జారి కడుఁజీఁకటాయఁగదవే

(॥మంచి॥)
వుబ్బున నాతని దిక్కు వుడివోక చూచి చూచి
గబ్బివైతివి గదవే కలికీ
నిబ్బరపు జవ్వనాన నీ వితని నొత్తఁగా నీ-
గుబ్బలు పోలించ పూవుగుత్తులాయఁగదవే

(॥మంచి॥)
వావులు చెప్పుచు నీవు వరుసఁ గాఁగిట నించి
దేవులైతి గదె తెఱవ
యీవేళ శ్రీవేంకటేశు డీతఁ డిట్టె నిన్నుఁగూడె
వేవేళకు నీ మోవి విందులాయఁగదవే

(||pallavi||)
maṁchidĕ nī janmamu maguvalalo nĕllā
pĕṁchagĕ nī kannulu pĕddalāyam̐gadave

(||maṁchi||)
mŏga michchamām̐ṭale munugŏni āḍiyāḍi
vĕgalivaidivigadĕ vĕlam̐dī
viga viga navvi nīvu vibhunim̐ jimmirem̐sam̐gā
siguramu jāri kaḍum̐jīm̐kaḍāyam̐gadave

(||maṁchi||)
vubbuna nādani dikku vuḍivoga sūsi sūsi
gabbivaidivi gadave kaligī
nibbarabu javvanāna nī vidani nŏttam̐gā nī-
gubbalu poliṁcha pūvuguttulāyam̐gadave

(||maṁchi||)
vāvulu sĕppusu nīvu varusam̐ gām̐giḍa niṁchi
devulaidi gadĕ tĕṟava
yīveḽa śhrīveṁkaḍeśhu ḍīdam̐ ḍiṭṭĕ ninnum̐gūḍĕ
veveḽagu nī movi viṁdulāyam̐gadave