మంచిదయ్యా వలపులు మారుబేరా లాడేవు
(॥పల్లవి॥)
మంచిదయ్యా వలపులు మారుబేరా లాడేవు
పొంచి నెట్టువడినది పొరుగాపె మీఁదను
(॥॥)
కచ్చుపెట్టి యాపె నిన్నుఁ గతలెల్లా నడుగఁగా
మచ్చిక నీ వెవ్వరితో మాటలాడేవు
అచ్చముగ నీ మొగము అట్టె తప్పకచూడఁ గా
ఇచ్చకము సేసుకొని యెక్కడ చూచేవు
(॥॥)
చెలరేఁగి యాపె నీతో సెలవుల నవ్వఁగాను
నలువంక నెవ్వతెతో నవ్వులు నవ్వేవు
సలిగెతో నిట్టె నిన్ను సారె సారెఁ జెనఁకఁగా
వెలినున్న యాపెనేల వెలిగోర నూఁవేవు
(॥॥)
కప్పురపు విడెము కలికి నీకు నొఁసగఁగా
దప్పిదేర నాపెకేల తమ్మ వెట్టేవు
అప్పుడె శ్రీవేంకటేశ అలమేలుమంగ గూడె
చొప్పుననే యాపె కెంతచుట్టమయేవు
(||pallavi||)
maṁchidayyā valabulu māruberā lāḍevu
pŏṁchi nĕṭṭuvaḍinadi pŏrugābĕ mīm̐danu
(||||)
kachchubĕṭṭi yābĕ ninnum̐ gadalĕllā naḍugam̐gā
machchiga nī vĕvvarido māḍalāḍevu
achchamuga nī mŏgamu aṭṭĕ tappagasūḍam̐ gā
ichchagamu sesugŏni yĕkkaḍa sūsevu
(||||)
sĕlarem̐gi yābĕ nīdo sĕlavula navvam̐gānu
naluvaṁka nĕvvadĕdo navvulu navvevu
saligĕdo niṭṭĕ ninnu sārĕ sārĕm̐ jĕnam̐kam̐gā
vĕlinunna yābĕnela vĕligora nūm̐vevu
(||||)
kappurabu viḍĕmu kaligi nīgu nŏm̐sagam̐gā
dappidera nābĕgela tamma vĕṭṭevu
appuḍĕ śhrīveṁkaḍeśha alamelumaṁga gūḍĕ
sŏppunane yābĕ kĕṁtasuṭṭamayevu