Mamchidanamum seyamga mamkudanaa lemtige

మంచితనముఁ సేయఁగ మంకుదనా లేఁటికే
Language

(॥పల్లవి॥)
మంచితనముఁ సేయఁగ మంకుదనా లేఁటికే
అంచెల విభునితోడ నంత చలమేఁటికే

(॥మంచి॥)
గక్కన నాతఁడు నిన్నుఁ గప్పురాన వేసితేను
ఇక్కువలు దాఁకెనంటా యేల తిట్టేవే
చెక్కులనొక్కేనని చేరి వేఁడుకొనరాఁగా
పెక్కుగోళ్లు దాఁకీనంటా పెనఁగనేమిటికే

(॥మంచి॥)
ఘనుఁడు వల్లెగా నీపై కలువదండ వేసితే
చనుఁగవ దాఁకెనంటా సాదించేవేమే
యనసి యందుకె యాతఁడిట్టె కాఁగిలించుకొంటే
తనువంటెఁ జెమటంటా తప్పువేయనేఁటికే

(॥మంచి॥)
శ్రీవేంకటేశుఁడు నిన్ను చెందామరలవేసితే
యీవేళనేల జంకించే విందరిలోన
చేవదేర నీతఁడే చేకొని రతిఁ గలిసె
భావిం చలఇంచెనంటా పంతమాడనేఁటికే

(||pallavi||)
maṁchidanamum̐ seyam̐ga maṁkudanā lem̐ṭige
aṁchĕla vibhunidoḍa naṁta salamem̐ṭige

(||maṁchi||)
gakkana nādam̐ḍu ninnum̐ gappurāna vesidenu
ikkuvalu dām̐kĕnaṁṭā yela tiṭṭeve
sĕkkulanŏkkenani seri vem̐ḍugŏnarām̐gā
pĕkkugoḽlu dām̐kīnaṁṭā pĕnam̐ganemiḍige

(||maṁchi||)
ghanum̐ḍu vallĕgā nībai kaluvadaṁḍa veside
sanum̐gava dām̐kĕnaṁṭā sādiṁcheveme
yanasi yaṁdugĕ yādam̐ḍiṭṭĕ kām̐giliṁchugŏṁṭe
tanuvaṁṭĕm̐ jĕmaḍaṁṭā tappuveyanem̐ṭige

(||maṁchi||)
śhrīveṁkaḍeśhum̐ḍu ninnu sĕṁdāmaralaveside
yīveḽanela jaṁkiṁche viṁdarilona
sevadera nīdam̐ḍe segŏni radim̐ galisĕ
bhāviṁ sala̮iṁchĕnaṁṭā paṁtamāḍanem̐ṭige