Mamchidanamulu sesi vamchugonera vadani

మంచితనములు సేసి వంచుకోనేర వతని
Language

(॥పల్లవి॥)
మంచితనములు సేసి వంచుకోనేర వతని
పొంచి మోవి చూపితేనే పొందు నీకు నియ్యఁడా

(॥మంచి॥)
పచ్చిసేసి బలిమినే పతినేల పిలిచేవే
యిచ్చకమాడితే నాతఁ డింటికి రాఁడా
బచ్చెనఆనలు వెట్టి బాసలేల అడిగేవే
చెచ్చెర నీవు మొక్కితే చెప్పినట్టు సేయఁడా

(॥మంచి॥)
తలుపు మూసుక యేల తగఁ బతి నాఁగేవే
వలచితినంటేనే వద్ద నుండఁడా
మలసి పొలసి యేల మనసు సోదించేవే
మొలకనవ్వు నవ్వితే ముచ్చటెల్లాఁ జెప్పఁడా

(॥మంచి॥)
చిప్పిల శ్రీవేంకటేశుఁ జెనకి యేల పట్టేవే
కప్పురవిడె మిచ్చితే కాఁగిలించండా
దప్పిదేర నప్పటిని తమకపడఁగనేలే
చెప్పినప్రియములకే చేకొనిట్టె కూడఁడా

(||pallavi||)
maṁchidanamulu sesi vaṁchugonera vadani
pŏṁchi movi sūbidene pŏṁdu nīgu niyyam̐ḍā

(||maṁchi||)
pachchisesi balimine padinela piliseve
yichchagamāḍide nādam̐ ḍiṁṭigi rām̐ḍā
bachchĕnaānalu vĕṭṭi bāsalela aḍigeve
sĕchchĕra nīvu mŏkkide sĕppinaṭṭu seyam̐ḍā

(||maṁchi||)
talubu mūsuga yela tagam̐ badi nām̐geve
valasidinaṁṭene vadda nuṁḍam̐ḍā
malasi pŏlasi yela manasu sodiṁcheve
mŏlaganavvu navvide muchchaḍĕllām̐ jĕppam̐ḍā

(||maṁchi||)
sippila śhrīveṁkaḍeśhum̐ jĕnagi yela paṭṭeve
kappuraviḍĕ michchide kām̐giliṁchaṁḍā
dappidera nappaḍini tamagabaḍam̐ganele
sĕppinapriyamulage segŏniṭṭĕ kūḍam̐ḍā