మంచితనము సేయఁగ మారుమలతు రటవే
(॥పల్లవి॥)
మంచితనము సేయఁగ మారుమలతు రటవే
కంచువంటి చిత్తములో కపటాలేమిటికే
(॥॥)
అక్కరతో రమణుఁడు అట్టే నీపై బత్తిని
చెక్కు నొక్కఁగానే చేయి దీసేవు
మొక్కలాన వీడెమిచ్చి మొదల నాకు మడిచి
గక్కన నియ్యఁగానే కారమనేవు
(॥॥)
మేలుగలవాఁడు గాన మేనదానవంటా నిన్ను
కాలు దొక్కఁగా నేల గాతలాడేవే
మేలిమి పన్నీరుచల్లి మేదించిన గందము
వేల నీపైఁ జమరఁగ వేఁడి యనేవు
(॥॥)
చనవుతో శ్రీవేంకటేశ్వరుఁడు కాఁగిటఁ గూడి
చెనకఁగ నప్పటిని సిగ్గువడేవే
ననుపునఁ దురుమున నానావిరులు ముడిచి
మొనగోరు నాఁటించితే మొగచాటనేవు
(||pallavi||)
maṁchidanamu seyam̐ga mārumaladu raḍave
kaṁchuvaṁṭi sittamulo kabaḍālemiḍige
(||||)
akkarado ramaṇum̐ḍu aṭṭe nībai battini
sĕkku nŏkkam̐gāne seyi dīsevu
mŏkkalāna vīḍĕmichchi mŏdala nāgu maḍisi
gakkana niyyam̐gāne kāramanevu
(||||)
melugalavām̐ḍu gāna menadānavaṁṭā ninnu
kālu dŏkkam̐gā nela gādalāḍeve
melimi pannīrusalli mediṁchina gaṁdamu
vela nībaim̐ jamaram̐ga vem̐ḍi yanevu
(||||)
sanavudo śhrīveṁkaḍeśhvarum̐ḍu kām̐giḍam̐ gūḍi
sĕnagam̐ga nappaḍini sigguvaḍeve
nanubunam̐ durumuna nānāvirulu muḍisi
mŏnagoru nām̐ṭiṁchide mŏgasāḍanevu