మంచితనము సేసితే మచ్చికలు సతమౌను
(॥పల్లవి॥)
మంచితనము సేసితే మచ్చికలు సతమౌను
ముంచి మొకదాకిరిగా మొక్కవే యీతనికి
(॥మంచి॥)
సారెసారె మాటలు చవులుగా నాడితే
యారీతులనే పతి యేమిసేసి వచ్చినాను
చేరి చేరి ప్రియములే చెప్పువే యీతనికి
(॥మంచి॥)
కడుఁ జుట్టరికములో కలయ మెలఁగితేను
కడవారిమైనాను కరఁగు మతి
గుడిగొని యాతనిమై గురుతు లెన్నుండినాను
చిడుముడి నిచ్చకమే సేయవే యీతనికి
(॥మంచి॥)
పిలిచి ప్రియముచెప్పి పెనఁగఁగఁ జూచితేను
కలయనివారికైనా కడఁగుఁదమి
యెలమి శ్రీవేంకటేడశుఁ డేలె నలమేల్మంగవు
చెలఁగికాఁపురములు సేయవే యీతనికి
(||pallavi||)
maṁchidanamu seside machchigalu sadamaunu
muṁchi mŏgadāgirigā mŏkkave yīdanigi
(||maṁchi||)
sārĕsārĕ māḍalu savulugā nāḍide
yārīdulane padi yemisesi vachchinānu
seri seri priyamule sĕppuve yīdanigi
(||maṁchi||)
kaḍum̐ juṭṭarigamulo kalaya mĕlam̐gidenu
kaḍavārimainānu karam̐gu madi
guḍigŏni yādanimai gurudu lĕnnuṁḍinānu
siḍumuḍi nichchagame seyave yīdanigi
(||maṁchi||)
pilisi priyamusĕppi pĕnam̐gam̐gam̐ jūsidenu
kalayanivārigainā kaḍam̐gum̐dami
yĕlami śhrīveṁkaḍeḍaśhum̐ ḍelĕ nalamelmaṁgavu
sĕlam̐gigām̐puramulu seyave yīdanigi