Mamchidanaana vachchedi machcharimchamgaa vachcheenaa

మంచితనాన వచ్చేది మచ్చరించఁగా వచ్చీనా
Language

(॥పల్లవి॥)
మంచితనాన వచ్చేది మచ్చరించఁగా వచ్చీనా
కంచువలె వాయించి గాసి సేతురా

(॥మంచి॥)
కక్కసించి మాటలాడి కాతరాన మొక్కు మొక్కి
చెక్కు నొక్కి యేల యింత చిమ్మిరేఁచేవే
అక్కరగలఁడు నీపైనాతఁడు మొదలనే
లక్కవలెఁ గరఁచి యీలాగు సేతురా

(॥మంచి॥)
వేసరించి వెడ్డు వెట్టి వెక్కసానఁ బెనఁగుచు
గోస నాసచేసి యేల గోరసేసేవే
ఆసపడి వుండు నీకునాతఁడు నీమోము చూచి
వాసె బలపమువలె వడి నింతరాతురా

(॥మంచి॥)
పంతమాడి కాఁగిలించి బలిమిని గోరుదీసి
మంతనానఁ గూడి యెంత మరిగించేవే
చెంతల నీ ప్రాణము శ్రీ వేంకటేశ్వరుఁడు
బంతివలెఁ బట్టి పట్టి బడలింతురా

(||pallavi||)
maṁchidanāna vachchedi machchariṁcham̐gā vachchīnā
kaṁchuvalĕ vāyiṁchi gāsi sedurā

(||maṁchi||)
kakkasiṁchi māḍalāḍi kādarāna mŏkku mŏkki
sĕkku nŏkki yela yiṁta simmirem̐seve
akkaragalam̐ḍu nībainādam̐ḍu mŏdalane
lakkavalĕm̐ garam̐si yīlāgu sedurā

(||maṁchi||)
vesariṁchi vĕḍḍu vĕṭṭi vĕkkasānam̐ bĕnam̐gusu
gosa nāsasesi yela goraseseve
āsabaḍi vuṁḍu nīgunādam̐ḍu nīmomu sūsi
vāsĕ balabamuvalĕ vaḍi niṁtarādurā

(||maṁchi||)
paṁtamāḍi kām̐giliṁchi balimini gorudīsi
maṁtanānam̐ gūḍi yĕṁta marigiṁcheve
sĕṁtala nī prāṇamu śhrī veṁkaḍeśhvarum̐ḍu
baṁtivalĕm̐ baṭṭi paṭṭi baḍaliṁturā