Mamchidanaalage lonu mari sadalagum gaamu

మంచితనాలకే లోను మరి సటలకుఁ గాము
Language

(॥పల్లవి॥)
మంచితనాలకే లోను మరి సటలకుఁ గాము
వుంచపు నీ జంకెనల వొరయకు మమ్మును

(॥మంచి॥)
చిగురువంటి వారు చెలులు - యింత
వొగరు వలపులకు నోపుదురా
మగవాఁడు రాతివంటి మనసువాఁడు - యీ
తగవు నీ వెరఁగవా తడవకు మమ్మును

(॥మంచి॥)
నిండి తొలఁకనివారు నెలఁతలు - యింత
చండి సరసములకుఁ జాలుదురా
రండు నాడేటివారు రమణులు
అండ నీవే కనుకొనే వడుగకు మమ్మును

(॥మంచి॥)
కప్పురము వంటివారలు కాంతలు - వట్టి
దప్పి విరహములకుఁ దగుదురా
తెప్పల శ్రీవేంకటేశ దేవుఁడవు - నేఁడు
కప్పుకొని కూడితివి కరుణించు మమ్మును

(||pallavi||)
maṁchidanālage lonu mari saḍalagum̐ gāmu
vuṁchabu nī jaṁkĕnala vŏrayagu mammunu

(||maṁchi||)
siguruvaṁṭi vāru sĕlulu - yiṁta
vŏgaru valabulagu nobudurā
magavām̐ḍu rādivaṁṭi manasuvām̐ḍu - yī
tagavu nī vĕram̐gavā taḍavagu mammunu

(||maṁchi||)
niṁḍi tŏlam̐kanivāru nĕlam̐talu - yiṁta
saṁḍi sarasamulagum̐ jāludurā
raṁḍu nāḍeḍivāru ramaṇulu
aṁḍa nīve kanugŏne vaḍugagu mammunu

(||maṁchi||)
kappuramu vaṁṭivāralu kāṁtalu - vaṭṭi
dappi virahamulagum̐ dagudurā
tĕppala śhrīveṁkaḍeśha devum̐ḍavu - nem̐ḍu
kappugŏni kūḍidivi karuṇiṁchu mammunu