Mamchidaaye daani keraa maanu mannadaanam gaanu

మంచిదాయె దాని కేరా మాను మన్నదానఁ గాను
Language

(॥పల్లవి॥)
మంచిదాయె దాని కేరా మాను మన్నదానఁ గాను
కొంచకు నీ సాజపుగుణము చెప్పితిని

(॥మంచి॥)
ననుపై నీమాటలు నాకుఁ బ్రియములు గాని
అనువై నీకుఁ బ్రియము ఆకెమాటలు
విను నేఁ దలఁతు నాకు నీవు దేవరవు గాని
అనిశము నీపాలిటి కాపెపో దేవర

(॥మంచి॥)
నిండార నామొక్కులకు నీవు గుఱి యింతే కాని
అండ నీమొక్కుల కైతే నాపె గుఱి
పండినవలపు లెల్ల పదివేలు నీకు నత్తు
కొండవంటి వలపులు కోటి యాపె కత్తువు

(॥మంచి॥)
మించి నాకన్నులు నీమీఁదనే వుండుఁ గాని
అంచు మోచి నీకన్నులు ఆపెమీఁదివే
కొంచక శ్రీవేంకటేశ కూడితి నే నిన్ను నీవు
యెంచి యాపెఁ గూడితివి యిద్దరు మావారే

(||pallavi||)
maṁchidāyĕ dāni kerā mānu mannadānam̐ gānu
kŏṁchagu nī sājabuguṇamu sĕppidini

(||maṁchi||)
nanubai nīmāḍalu nāgum̐ briyamulu gāni
anuvai nīgum̐ briyamu āgĕmāḍalu
vinu nem̐ dalam̐tu nāgu nīvu devaravu gāni
aniśhamu nībāliḍi kābĕbo devara

(||maṁchi||)
niṁḍāra nāmŏkkulagu nīvu guṟi yiṁte kāni
aṁḍa nīmŏkkula kaide nābĕ guṟi
paṁḍinavalabu lĕlla padivelu nīgu nattu
kŏṁḍavaṁṭi valabulu koḍi yābĕ kattuvu

(||maṁchi||)
miṁchi nāgannulu nīmīm̐dane vuṁḍum̐ gāni
aṁchu mosi nīgannulu ābĕmīm̐dive
kŏṁchaga śhrīveṁkaḍeśha kūḍidi ne ninnu nīvu
yĕṁchi yābĕm̐ gūḍidivi yiddaru māvāre