Mamchidaayam gaaneeve manabhaagyamaaya nadi

మంచిదాయఁ గానీవే మనభాగ్యమాయ నది
Language

(॥పల్లవి॥)
మంచిదాయఁ గానీవే మనభాగ్యమాయ నది
కంచముపొత్తు లెటులాఁ గలసెనో కాని

(॥మంచి॥)
సెలవుల నవ్వు లూరె సిగ్గులు మోమునఁ గప్పె
అలరుచుఁ జెలులు యేకాంతమాడఁగా
తెలియరాదు మాట దీకొని యడుగరాదు
పలుకుఁబంతము లెట్టు ఫలించెనోకాని

(॥మంచి॥)
నిక్కెను మేనఁ గళలు నిలువెల్లాఁ బులకించె
చక్కఁగా లేకలు లోలో జదువుకోఁగా
పక్కన సోదించరాదు బలిమిసేయఁగరాదు
ఇక్కువ వలపు లెట్టు యీడేరెనోకాని

(॥మంచి॥)
చన్నుల జెమట నించె చవులు మోవి నెసఁగె
కన్నుల శ్రీవేంకటేశు గనుఁగొనఁగా
యెన్నిక లూహించరాదు యెరుకసేసుకోరాదు
వున్నతిరతు లివెట్టు వుప్పొంగెనోకాని

(||pallavi||)
maṁchidāyam̐ gānīve manabhāgyamāya nadi
kaṁchamubŏttu lĕḍulām̐ galasĕno kāni

(||maṁchi||)
sĕlavula navvu lūrĕ siggulu momunam̐ gappĕ
alarusum̐ jĕlulu yegāṁtamāḍam̐gā
tĕliyarādu māḍa dīgŏni yaḍugarādu
palugum̐baṁtamu lĕṭṭu phaliṁchĕnogāni

(||maṁchi||)
nikkĕnu menam̐ gaḽalu niluvĕllām̐ bulagiṁchĕ
sakkam̐gā legalu lolo jaduvugom̐gā
pakkana sodiṁcharādu balimiseyam̐garādu
ikkuva valabu lĕṭṭu yīḍerĕnogāni

(||maṁchi||)
sannula jĕmaḍa niṁchĕ savulu movi nĕsam̐gĕ
kannula śhrīveṁkaḍeśhu ganum̐gŏnam̐gā
yĕnniga lūhiṁcharādu yĕrugasesugorādu
vunnadiradu livĕṭṭu vuppŏṁgĕnogāni