మంచిదాయ మేలు మేలు మాకు నది పరిణాము
(॥పల్లవి॥)
మంచిదాయ మేలు మేలు మాకు నది పరిణాము
అంచెల నాకె నిన్ను ఆదరించెనా
(॥మంచి॥)
చెలఁగి వున్నాఁడవు చిమ్ముఁగళలతో నేఁడు
మలసి నీతో నాపె మాటలాడెనా
సొలసేవు కెలసేవు సుమాళముతో నప్పటి
కులికి నీపై నాపె గురుతులు నించెనా
(॥మంచి॥)
ఇందరికి నీవేళ యేమడిగిన నిచ్చేవు
విందువలె నాపె నీకు విడెమిచ్చెనా
పందేలకే పెనఁగేవు పారిపారి మాతోను
సందడించి తనమోవి చవిచూపెనా
(॥మంచి॥)
గక్కన నన్ను మన్నించి కాఁగిలించి కూడేవు
పుక్కటగాక నీకాపె బుద్దిచెప్పెనా
యిక్కువతో శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
వక్కణంచి నీకుఁ జెప్పి వరుసకు నంపెనా
(||pallavi||)
maṁchidāya melu melu māgu nadi pariṇāmu
aṁchĕla nāgĕ ninnu ādariṁchĕnā
(||maṁchi||)
sĕlam̐gi vunnām̐ḍavu simmum̐gaḽalado nem̐ḍu
malasi nīdo nābĕ māḍalāḍĕnā
sŏlasevu kĕlasevu sumāḽamudo nappaḍi
kuligi nībai nābĕ gurudulu niṁchĕnā
(||maṁchi||)
iṁdarigi nīveḽa yemaḍigina nichchevu
viṁduvalĕ nābĕ nīgu viḍĕmichchĕnā
paṁdelage pĕnam̐gevu pāribāri mādonu
saṁdaḍiṁchi tanamovi savisūbĕnā
(||maṁchi||)
gakkana nannu manniṁchi kām̐giliṁchi kūḍevu
pukkaḍagāga nīgābĕ buddisĕppĕnā
yikkuvado śhrī veṁkaḍeśha nannu nelidivi
vakkaṇaṁchi nīgum̐ jĕppi varusagu naṁpĕnā