మంచిదానివలెనే మనతోడఁ బొందు సేసి
(॥పల్లవి॥)
మంచిదానివలెనే మనతోడఁ బొందు సేసి
కంచము పొత్తునఁ బెట్టి కాకుసేసీ నాపె
(॥మంచి॥)
యీకడఁ దా నెలయించి యింటికిఁ దోడుకవచ్చి
నాకు నీకు విడెమిచ్చి నవ్వీ నాపె
యేకతానకు బిలిచి యిద్దరిఁ గూచుండఁబెట్టి
చేకొని యందరికినిఁ జెప్పి చూపీ నాపె
(॥మంచి॥)
యెడయక నిన్నూ నన్నూ నిట్టె సిగ్గులు దేర్చి
నడమఁ దాఁ దెరవేసి నవ్వీ వాపె
జడియ కిట్టె తనసకినలమంచ మిచ్చి
సడిఁబెట్టి రతులు రచ్చలవేసీ వాపె
(॥మంచి॥)
యిమ్ముల నొక్కొకరి నింతోఁ బెండ్లిసేసి
నమ్ము యేడాఁ జెప్పనని నవ్వీ నాపె
నెమ్మది శ్రీవేంకటేశ నిన్నుఁదా నిపుడు గూడి
రమ్మని లోలోఁగాఁపురముసేసీ నాపె
(||pallavi||)
maṁchidānivalĕne manadoḍam̐ bŏṁdu sesi
kaṁchamu pŏttunam̐ bĕṭṭi kāgusesī nābĕ
(||maṁchi||)
yīgaḍam̐ dā nĕlayiṁchi yiṁṭigim̐ doḍugavachchi
nāgu nīgu viḍĕmichchi navvī nābĕ
yegadānagu bilisi yiddarim̐ gūsuṁḍam̐bĕṭṭi
segŏni yaṁdariginim̐ jĕppi sūbī nābĕ
(||maṁchi||)
yĕḍayaga ninnū nannū niṭṭĕ siggulu dersi
naḍamam̐ dām̐ dĕravesi navvī vābĕ
jaḍiya kiṭṭĕ tanasaginalamaṁcha michchi
saḍim̐bĕṭṭi radulu rachchalavesī vābĕ
(||maṁchi||)
yimmula nŏkkŏgari niṁtom̐ bĕṁḍlisesi
nammu yeḍām̐ jĕppanani navvī nābĕ
nĕmmadi śhrīveṁkaḍeśha ninnum̐dā nibuḍu gūḍi
rammani lolom̐gām̐puramusesī nābĕ