Mamchidaana nalamelmamga vo madiraakshi

మంచిదాన నలమేల్‌మంగ వో మదిరాక్షి
Language

(॥పల్లవి॥)
మంచిదాన నలమేల్‌మంగ వో మదిరాక్షి
యెంచి చూచితే మదనుఁ డిద్దరికి సాక్షి

(॥మంచి॥)
చెనకేవు యెంతేసి చిగురుఁబోడి
కొనలుసాగినవి నీగొళ్లు వాఁడి
పెనఁగేవు వలపులు పేఁడి పేఁడి
గునియుచు మొక్కేవేమే కోఁడికోఁడి

(॥మంచి॥)
నవ్వేవు మేలుమేలే నయగారీ
చివ్వన నీమేనినిండాఁ జేమటలూరీ
దువ్వటముకొంగంటేవు దూరిదూరి
కువ్వసేసేవేమే వాని కోరికోరి

(॥మంచి॥)
నెలకొనేవే కాఁగిట నెఱవాది
కలపె నీమోవితేనె కడుఁబోది
లలి శ్రీవేంకటేశుఁడఁ జలపాది
వెలసె నీనాపొందు వీదివీది

(||pallavi||)
maṁchidāna nalamel‌maṁga vo madirākṣhi
yĕṁchi sūside madanum̐ ḍiddarigi sākṣhi

(||maṁchi||)
sĕnagevu yĕṁtesi sigurum̐boḍi
kŏnalusāginavi nīgŏḽlu vām̐ḍi
pĕnam̐gevu valabulu pem̐ḍi pem̐ḍi
guniyusu mŏkkeveme kom̐ḍigom̐ḍi

(||maṁchi||)
navvevu melumele nayagārī
sivvana nīmeniniṁḍām̐ jemaḍalūrī
duvvaḍamugŏṁgaṁṭevu dūridūri
kuvvaseseveme vāni korigori

(||maṁchi||)
nĕlagŏneve kām̐giḍa nĕṟavādi
kalabĕ nīmovidenĕ kaḍum̐bodi
lali śhrīveṁkaḍeśhum̐ḍam̐ jalabādi
vĕlasĕ nīnābŏṁdu vīdivīdi