Mamchi vayasugaalamu maayado nemari vumdi

మంచి వయసుకాలము మాయతో నేమరి వుండి
Language

(॥పల్లవి॥)
మంచి వయసుకాలము మాయతో నేమరి వుండి
పంచేంద్రియసుఖము పాలాయె బ్రదుకు

(॥మంచి॥)
ముదిసే కాలమునాఁడు మోక్షము సాధించే నంటా
మదించి నూరేండ్ల ముది మది దప్పును
కదలలే కంతటను కన్నుల పొరలు గప్పి
అదెవ్వ రిదెవ్వరంటా నడుగుచు నుండును

(॥మంచి॥)
జవ్వనపాయము వోఁగా సన్యాసి నయ్యే నంటాను
నవ్వుతానే నరసి వణఁకఁ జొచ్చును
చివ్వన నెముక వంగి చేత నూతకోల పట్టి
వువ్విళ్లూర నెంగిలిలో నోలలాఁడఁ జొచ్చును

(॥మంచి॥)
యింక మీఁదట శ్రీ వేంకటేశ్వరు సేవించే నంటా
సంకె లేక వుండఁగాను సత్వవోవును
అంకెల వీఁడు వెఱ్ఱియైనా నంతరాత్మగాన
మంకు దేర నీమాటకే మంచిగతి వెట్టును

(||pallavi||)
maṁchi vayasugālamu māyado nemari vuṁḍi
paṁcheṁdriyasukhamu pālāyĕ bradugu

(||maṁchi||)
mudise kālamunām̐ḍu mokṣhamu sādhiṁche naṁṭā
madiṁchi nūreṁḍla mudi madi dappunu
kadalale kaṁtaḍanu kannula pŏralu gappi
adĕvva ridĕvvaraṁṭā naḍugusu nuṁḍunu

(||maṁchi||)
javvanabāyamu vom̐gā sanyāsi nayye naṁṭānu
navvudāne narasi vaṇam̐kam̐ jŏchchunu
sivvana nĕmuga vaṁgi seda nūdagola paṭṭi
vuvviḽlūra nĕṁgililo nolalām̐ḍam̐ jŏchchunu

(||maṁchi||)
yiṁka mīm̐daḍa śhrī veṁkaḍeśhvaru seviṁche naṁṭā
saṁkĕ lega vuṁḍam̐gānu satvavovunu
aṁkĕla vīm̐ḍu vĕṭriyainā naṁtarātmagāna
maṁku dera nīmāḍage maṁchigadi vĕṭṭunu