మంచం బెక్కిన పిమ్మట మరి వావియు లేదు
(॥పల్లవి॥)
మంచం బెక్కిన పిమ్మట మరి వావియు లేదు
చంచల ముడిగిన పిమ్మట శంకకుఁ బనిలేదు
(॥మంచం॥)
పదిలంబుగ సర్వాత్మకభావము దెలిసిన పిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచిన మొక్కక పోరాదు
హృదయము పరమేశ్వరునకు నిరవైపోయిన పిమ్మట
యెదిరిని కెలఁకులఁ జూడను ఇతరము పనిలేదు
(॥మంచం॥)
సకలేంద్రియములు హరిపై చయ్యనఁ బెట్టిన పిమ్మట
వొకటియు నోరికిఁ జవియను వొద్ధిక పనిలేదు
వికసించిన పరిణామము వెల్లువ ముంచిన పిమ్మట
చికురము ముడువనుఁ గట్టును చీరకుఁ బనిలేదు
(॥మంచం॥)
పరమాత్ముఁడు తిరువేంకటపతియనితెలిసినపిమ్మట
పరిపరి చదువుల లంపటములఁ బడఁ బనిలేదు
హరియే చైతన్యాత్మకుఁ డని తెలిసినపిమ్మట
దురితములకుఁ ఋణ్యములకు త్రోవే బనిలేదు
(||pallavi||)
maṁchaṁ bĕkkina pimmaḍa mari vāviyu ledu
saṁchala muḍigina pimmaḍa śhaṁkagum̐ baniledu
(||maṁchaṁ||)
padilaṁbuga sarvātmagabhāvamu dĕlisina pimmaḍa
mudamuna nĕvvarim̐ jūsina mŏkkaga porādu
hṛdayamu parameśhvarunagu niravaiboyina pimmaḍa
yĕdirini kĕlam̐kulam̐ jūḍanu idaramu paniledu
(||maṁchaṁ||)
sagaleṁdriyamulu haribai sayyanam̐ bĕṭṭina pimmaḍa
vŏgaḍiyu norigim̐ javiyanu vŏddhiga paniledu
vigasiṁchina pariṇāmamu vĕlluva muṁchina pimmaḍa
siguramu muḍuvanum̐ gaṭṭunu sīragum̐ baniledu
(||maṁchaṁ||)
paramātmum̐ḍu tiruveṁkaḍabadiyanidĕlisinabimmaḍa
paribari saduvula laṁpaḍamulam̐ baḍam̐ baniledu
hariye saidanyātmagum̐ ḍani tĕlisinabimmaḍa
duridamulagum̐ ṛṇyamulagu trove baniledu