Mamcha made yillade maada ledige

మంచ మదె యిల్లదె మాట లేటికే
Language

(॥పల్లవి॥)
మంచ మదె యిల్లదె మాట లేటికే
నించిన వేడుకతోడ నిద్దిరించు లోనను

(॥మంచ॥)
యింటికిఁ జెప్పి యంపితి నిందాఁకా నేల రావైతి
వంటఁ గాక తొలఁగితి నట్టె వుండరా
వెంట వచ్చినచెలిచే వింటిమి నీ సుద్దు లెల్లా
వొంటినైనాఁ బవ్వళించు వొక్కఁడవే లోనను

(॥మంచ॥)
చూచియైనాఁ బొమ్మంటిఁగా సుద్దులు చెప్పి యంపితి
వీ చాయకు రాకు మంచ మెక్కి వున్నదాన
నీచేఁత లన్నియును నీ వెంటనే వచ్చె
కూచుండరా యిఁకనైనా కుదురయి లోనను

(॥మంచ॥)
యెదురు చూచితిఁగా నీ వేడ నుంటివో కాని
పదరకురా యిది పంతము గాదు
పొదిగి శ్రీవేంకటేశ పోనీక నన్నుఁ గూడితి
వుదుటై యెందునుఁ బోక వుండరా యీలోనను

(||pallavi||)
maṁcha madĕ yilladĕ māḍa leḍige
niṁchina veḍugadoḍa niddiriṁchu lonanu

(||maṁcha||)
yiṁṭigim̐ jĕppi yaṁpidi niṁdām̐kā nela rāvaidi
vaṁṭam̐ gāga tŏlam̐gidi naṭṭĕ vuṁḍarā
vĕṁṭa vachchinasĕlise viṁṭimi nī suddu lĕllā
vŏṁṭinainām̐ bavvaḽiṁchu vŏkkam̐ḍave lonanu

(||maṁcha||)
sūsiyainām̐ bŏmmaṁṭim̐gā suddulu sĕppi yaṁpidi
vī sāyagu rāgu maṁcha mĕkki vunnadāna
nīsem̐ta lanniyunu nī vĕṁṭane vachchĕ
kūsuṁḍarā yim̐kanainā kudurayi lonanu

(||maṁcha||)
yĕduru sūsidim̐gā nī veḍa nuṁṭivo kāni
padaragurā yidi paṁtamu gādu
pŏdigi śhrīveṁkaḍeśha ponīga nannum̐ gūḍidi
vuduḍai yĕṁdunum̐ boga vuṁḍarā yīlonanu