(॥పల్లవి॥)
మలసి వాదు లడువ మాకేఁటికే
యిల యెల్లాఁ దా నేలితే నింకా బతుకనీవే
(॥మలసి॥)
పంతమాడ నోపము బలువుని తోడను మా-
యంతనుండఁగా నైనపాటదె చాలదా
యెంత లేదు తనబీరా లెవ్వరు నెరఁగరా
అంతటి వాఁడౌఁగాక అట్టె బతుకనీవే
(॥మలసి॥)
చలపట్ట నొపము సారెకు దొరలతోడ
కలపాటి రాజసము గైకొ నుండేము
వలవనిసటలేల వారి వీరి తోడను
నెలకొన్న జాణఁడైతే నిక్కి బతకనీవే
(॥మలసి॥)
చేరి నవ్వ నోపము శ్రీవేంకటేశ్వరుతోడ
కూరిమితోఁ దాఁ గూడినకూటమే చాలు
యీరీతి వినయములు యెవ్వరి ముందరఁ జేసీ
వేరు లేదు తా నేను వెస బతుక నీవే
(||pallavi||)
malasi vādu laḍuva māgem̐ṭige
yila yĕllām̐ dā nelide niṁkā baduganīve
(||malasi||)
paṁtamāḍa nobamu baluvuni toḍanu mā-
yaṁtanuṁḍam̐gā nainabāḍadĕ sāladā
yĕṁta ledu tanabīrā lĕvvaru nĕram̐garā
aṁtaḍi vām̐ḍaum̐gāga aṭṭĕ baduganīve
(||malasi||)
salabaṭṭa nŏbamu sārĕgu dŏraladoḍa
kalabāḍi rājasamu gaigŏ nuṁḍemu
valavanisaḍalela vāri vīri toḍanu
nĕlagŏnna jāṇam̐ḍaide nikki badaganīve
(||malasi||)
seri navva nobamu śhrīveṁkaḍeśhvarudoḍa
kūrimidom̐ dām̐ gūḍinagūḍame sālu
yīrīdi vinayamulu yĕvvari muṁdaram̐ jesī
veru ledu tā nenu vĕsa baduga nīve