Malaghunininnaberumaallu veemde

మలఘునినిన్నపెరుమాళ్ళు వీఁడే
Language

(॥పల్లవి॥)
మలఘునినిన్నపెరుమాళ్ళు వీఁడే
వెలయ రాజసమున విఱ్ఱవీఁగీ వాఁడే

(॥మలఘు॥)
నాలినిద్దరు దేవుళ్ళ నడుమ నిలుచుండి
కైలాటాలు చల్లీనదె కనుఁగొనల
వేళ వేళఁ బొత్తులను విందులారగించుకొంటా
వాలి కొలువుండీఁ దిరువాముడి మంటపాన

(॥మలఘు॥)
ఆటలుఁ బాటలుఁ జూచి అంగరంగవైభవముల
నీటుతోడ సొమ్ములెల్లా నిండాఁ బెట్టుక
గాఁటపు పూదండలతోఁ గస్తూరినామములతో
మేఁటి సింహాసనముపై మించేరు కళల

(॥మలఘు॥)
తామెరకొలనువలెఁ దగఁ దిరుచేల చాతి
కోమలులిద్దరుఁ దాను కుచ్చళ్ళువోసి
ప్రేమఁ గరకజడలు పిరిఁది దిండ్లు దీరిచి
కామించి నవ్వీ వాఁడే కల్యాణవేదికను

(॥మలఘు॥)
ముత్తేల చొల్లెపుచుట్టు ముంగురులపైఁ గప్పి
మెత్తిన గందపుఁబూఁత మేన నిండఁగా
హత్తిన పూవుదండలమర జల్లులలోనిఁ
కొత్తమేలుకట్లలోను గూచున్నాఁడు వీఁడె

(॥మలఘు॥)
కుడియడమకొప్పుల కుళ్ళాయి పాగచుంగుల
బెడిదపు దంపతులు పెండ్లిచవికెలో
అడరి శ్రీవేంకటేశుఁ డల మేలుమంగఁ దాను
పుడమిఁ గూడున్నవారు భోగపురతులను

(||pallavi||)
malaghunininnabĕrumāḽḽu vīm̐ḍe
vĕlaya rājasamuna viṭravīm̐gī vām̐ḍe

(||malaghu||)
nāliniddaru devuḽḽa naḍuma nilusuṁḍi
kailāḍālu sallīnadĕ kanum̐gŏnala
veḽa veḽam̐ bŏttulanu viṁdulāragiṁchugŏṁṭā
vāli kŏluvuṁḍīm̐ diruvāmuḍi maṁṭabāna

(||malaghu||)
āḍalum̐ bāḍalum̐ jūsi aṁgaraṁgavaibhavamula
nīḍudoḍa sŏmmulĕllā niṁḍām̐ bĕṭṭuga
gām̐ṭabu pūdaṁḍaladom̐ gastūrināmamulado
mem̐ṭi siṁhāsanamubai miṁcheru kaḽala

(||malaghu||)
tāmĕragŏlanuvalĕm̐ dagam̐ dirusela sādi
komaluliddarum̐ dānu kuchchaḽḽuvosi
premam̐ garagajaḍalu pirim̐di diṁḍlu dīrisi
kāmiṁchi navvī vām̐ḍe kalyāṇavediganu

(||malaghu||)
muttela sŏllĕbusuṭṭu muṁgurulabaim̐ gappi
mĕttina gaṁdabum̐būm̐ta mena niṁḍam̐gā
hattina pūvudaṁḍalamara jallulalonim̐
kŏttamelugaṭlalonu gūsunnām̐ḍu vīm̐ḍĕ

(||malaghu||)
kuḍiyaḍamagŏppula kuḽḽāyi pāgasuṁgula
bĕḍidabu daṁpadulu pĕṁḍlisavigĕlo
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍala melumaṁgam̐ dānu
puḍamim̐ gūḍunnavāru bhogaburadulanu