Makkuva naameemdam gala maayalavaamdu

మక్కువ నామీఁదఁ గల మాయలవాఁడు
Language

(॥పల్లవి॥)
మక్కువ నామీఁదఁ గల మాయలవాఁడు
వెక్కసాలు మాని యిందే వెదకరే చెలులు

(॥మక్కు॥)
తనకు నెదురు చూచి తా రాకుండఁగా నంపిన
వనిత కెదురు చూడ వలసె నేఁడు
మనసు చూడవలసే మరగున నున్నవాఁడో
వెనక నెరఁగరాదు వెదకరే చెలులు

(॥మక్కు॥)
పతిని దూరి దూరి పతి నావద్ది కంపిన-
సతిని దూరవలసె సారెకు నాకు
మతకాలు సేసుక యే మంచముపై నున్న వాఁడో
వెతదీర నాతని వెదకరే చెలులు

(॥మక్కు॥)
ఆతనిఁ జూచి మొక్కి ఆతనిఁ దోడితెచ్చిన-
దూతికకు మొక్కినదే దొడ్డాయ నాకు
కాతరానఁ గూడే శ్రీవేంకటపతిపై భారము
వేత మిప్పు డీడనుండే వెదకరే చెలులు

(||pallavi||)
makkuva nāmīm̐dam̐ gala māyalavām̐ḍu
vĕkkasālu māni yiṁde vĕdagare sĕlulu

(||makku||)
tanagu nĕduru sūsi tā rāguṁḍam̐gā naṁpina
vanida kĕduru sūḍa valasĕ nem̐ḍu
manasu sūḍavalase maraguna nunnavām̐ḍo
vĕnaga nĕram̐garādu vĕdagare sĕlulu

(||makku||)
padini dūri dūri padi nāvaddi kaṁpina-
sadini dūravalasĕ sārĕgu nāgu
madagālu sesuga ye maṁchamubai nunna vām̐ḍo
vĕdadīra nādani vĕdagare sĕlulu

(||makku||)
ādanim̐ jūsi mŏkki ādanim̐ doḍidĕchchina-
dūdigagu mŏkkinade dŏḍḍāya nāgu
kādarānam̐ gūḍe śhrīveṁkaḍabadibai bhāramu
veda mippu ḍīḍanuṁḍe vĕdagare sĕlulu