మక్కు వలర జేరులైన మంచిపండు చూచి నోరు
(॥పల్లవి॥)
మక్కు వలర జేరులైన మంచిపండు చూచి నోరు
గుక్కిళ్ళు మింగఁ జొచ్చె కొమ్మ యేమి సేతమే
(॥మక్కు॥)
పేరులేని రూపులేని పెద్దగురువు నొకనిఁ దలఁచి
వూరులేని యింటిలోన నుండఁ దలఁపఁగా
కూరలేని కూడు మిగులఁ గుడువఁ దలచి యాసపడెడు
నీరజాక్షి యొకతె దీని నెలఁత యేమి సేతమే
(॥మక్కు॥)
అడుగులేని కడువలోన నధికమైన నీట నగ్గి
కడఁగి రవులుకొలిపి లోన గాలి చేతఁ గాఁగఁగా
వుడుకుదెరఁగ కందులోన నుడుకకుండు టెఱుఁగ రాచు
వెడలిపోవు టెఱుఁగరాదు వెలది యేమి సేతమే
(॥మక్కు॥)
మాఁకులేని పువ్వులందు మంచిమంచి రేకు లెల్ల
వేఁక పడక చేకొనియ వేంకటాద్రినాధుఁడు
తోఁకవంక పెద్దతెరువు తోవ గానరాక వోయె
కాఁకదేర దీ తలఁపు కాఁత యేమి సేతమే
(||pallavi||)
makku valara jerulaina maṁchibaṁḍu sūsi noru
gukkiḽḽu miṁgam̐ jŏchchĕ kŏmma yemi sedame
(||makku||)
peruleni rūbuleni pĕddaguruvu nŏganim̐ dalam̐si
vūruleni yiṁṭilona nuṁḍam̐ dalam̐pam̐gā
kūraleni kūḍu migulam̐ guḍuvam̐ dalasi yāsabaḍĕḍu
nīrajākṣhi yŏgadĕ dīni nĕlam̐ta yemi sedame
(||makku||)
aḍuguleni kaḍuvalona nadhigamaina nīḍa naggi
kaḍam̐gi ravulugŏlibi lona gāli sedam̐ gām̐gam̐gā
vuḍugudĕram̐ga kaṁdulona nuḍugaguṁḍu ṭĕṟum̐ga rāsu
vĕḍalibovu ṭĕṟum̐garādu vĕladi yemi sedame
(||makku||)
mām̐kuleni puvvulaṁdu maṁchimaṁchi regu lĕlla
vem̐ka paḍaga segŏniya veṁkaḍādrinādhum̐ḍu
tom̐kavaṁka pĕddadĕruvu tova gānarāga voyĕ
kām̐kadera dī talam̐pu kām̐ta yemi sedame