Maila vaasi manumgaaya maadalelaraa

మైల వాసి మణుఁగాయ మాటలేలరా
Language

(॥పల్లవి॥)
మైల వాసి మణుఁగాయ మాటలేలరా
చాలుఁజాలు బనులెల్లఁ జక్కనాయరా

(॥మైల॥)
తొడిఁబడ నవ్వితిని తోడుతనే మొక్కితిని
చిడుముడి నిఁక నేమి చేసేవురా
అడరి నేఁ దిట్టితిని అంతలోఁ బంతమిచ్చితి
వడిగాఁ బైపై నాతో వాదులేలరా

(॥మైల॥)
కోపగించి చూచితిని గొబ్బననే మెచ్చితిని
మాపుదాక నింత జోలిమాటలేలరా
రేఁపకాడ నెడసితి మాపటంతఁ గూడితివి
యీపాటి వాసికిని యెగ్గులేలరా

(॥మైల॥)
మోవి గంటిసేసితి నామోమితేనె లిచ్చితిని
దేవుఁడ శ్రీవేంకటేశ తెగువేలరా
భావమెల్లఁ గరఁగితి పక్కన మెప్పించితిని
చేవదేరెఁ బనులెల్లఁ జింతలేలరా

(||pallavi||)
maila vāsi maṇum̐gāya māḍalelarā
sālum̐jālu banulĕllam̐ jakkanāyarā

(||maila||)
tŏḍim̐baḍa navvidini toḍudane mŏkkidini
siḍumuḍi nim̐ka nemi sesevurā
aḍari nem̐ diṭṭidini aṁtalom̐ baṁtamichchidi
vaḍigām̐ baibai nādo vādulelarā

(||maila||)
kobagiṁchi sūsidini gŏbbanane mĕchchidini
mābudāga niṁta jolimāḍalelarā
rem̐pagāḍa nĕḍasidi mābaḍaṁtam̐ gūḍidivi
yībāḍi vāsigini yĕggulelarā

(||maila||)
movi gaṁṭisesidi nāmomidenĕ lichchidini
devum̐ḍa śhrīveṁkaḍeśha tĕguvelarā
bhāvamĕllam̐ garam̐gidi pakkana mĕppiṁchidini
sevaderĕm̐ banulĕllam̐ jiṁtalelarā