Mahimellaa doppam domge majjanavela

మహిమెల్లా దొప్పఁ దోఁగె మజ్జనవేళ
Language

(॥పల్లవి॥)
మహిమెల్లా దొప్పఁ దోఁగె మజ్జనవేళ
సహజశృంగారాలు జడిసె శ్రీపతికి

(॥మహి॥)
ముత్తేలవానలెల్ల ముంచి కురుసినయట్టు
హత్తి పన్నీటి జలకమాయ హరికి
తత్తరానఁదెల్లమెయిలు తనుఁ బొదిగినయట్లు
కొత్తగాఁ గప్పురకాపు గుప్పిరి దేవునికి

(॥మహి॥)
నీలపుఁబేరులెల్లా నిండాఁ గట్టియట్టు
తేలఁ దట్టుపుణఁగు మెత్తిరి పతికి
అలరిమెఱఁగుదేగె లలముకొనినయట్టు
కోలుముందై సొమ్ములెల్లా గుప్పిరి విష్ణునికి

(॥మహి॥)
పెక్కునవరత్నములు పెద్దరాశి పొసినట్టు
యెక్కువదండలు గట్టిరి మూరితికి
వొక్కట నలమేలుమంగ నురమునఁ గట్టిరిదె
చిక్కనినవ్వులు మించె శ్రీవేంకటేశునకు

(||pallavi||)
mahimĕllā dŏppam̐ dom̐gĕ majjanaveḽa
sahajaśhṛṁgārālu jaḍisĕ śhrībadigi

(||mahi||)
muttelavānalĕlla muṁchi kurusinayaṭṭu
hatti pannīḍi jalagamāya harigi
tattarānam̐dĕllamĕyilu tanum̐ bŏdiginayaṭlu
kŏttagām̐ gappuragābu guppiri devunigi

(||mahi||)
nīlabum̐berulĕllā niṁḍām̐ gaṭṭiyaṭṭu
telam̐ daṭṭubuṇam̐gu mĕttiri padigi
alarimĕṟam̐gudegĕ lalamugŏninayaṭṭu
kolumuṁdai sŏmmulĕllā guppiri viṣhṇunigi

(||mahi||)
pĕkkunavaratnamulu pĕddarāśhi pŏsinaṭṭu
yĕkkuvadaṁḍalu gaṭṭiri mūridigi
vŏkkaḍa nalamelumaṁga nuramunam̐ gaṭṭiridĕ
sikkaninavvulu miṁchĕ śhrīveṁkaḍeśhunagu