మహి నుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు
(॥పల్లవి॥)
మహి నుద్యోగి గావలె మనుజుఁడైనవాఁడు
సహజివలె నుండేమీ సాధింపలేఁడు
(॥మహి॥)
వెదకి తలచుకొంటే విష్ణుఁడు గానవచ్చు
చెదరి మఱచితే సృష్టి చీఁకటౌ
పొదలి నడచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితేఁ గాలము నిమిషమై తోఁచు
(॥మహి॥)
వేడుకతోఁ జదివితే వేదశాస్త్రసంపన్నుఁడౌ
జాడతో నూరకుండితే జడుఁడౌను
వోడక తపసియైతే వున్నతోన్నతుఁడౌ
కూడక సోమరియైతే గుణహీనుఁడౌను
(॥మహి॥)
మురహరుఁ గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెఱఁగకుండితే వీరిడియౌను
శరణంటే శ్రీవేంకటేశ్వరుఁడు రక్షించును
పరగ సంశయించితే పాషండుఁడౌను
(||pallavi||)
mahi nudyogi gāvalĕ manujum̐ḍainavām̐ḍu
sahajivalĕ nuṁḍemī sādhiṁpalem̐ḍu
(||mahi||)
vĕdagi talasugŏṁṭe viṣhṇum̐ḍu gānavachchu
sĕdari maṟaside sṛṣhṭi sīm̐kaḍau
pŏdali naḍasidenu bhūmĕllā mĕṭṭi rāvachchu
nidiriṁchidem̐ gālamu nimiṣhamai tom̐su
(||mahi||)
veḍugadom̐ jadivide vedaśhāstrasaṁpannum̐ḍau
jāḍado nūraguṁḍide jaḍum̐ḍaunu
voḍaga tabasiyaide vunnadonnadum̐ḍau
kūḍaga somariyaide guṇahīnum̐ḍaunu
(||mahi||)
muraharum̐ gŏliside mokṣhamu sādhiṁchavachchu
vĕravĕṟam̐gaguṁḍide vīriḍiyaunu
śharaṇaṁṭe śhrīveṁkaḍeśhvarum̐ḍu rakṣhiṁchunu
paraga saṁśhayiṁchide pāṣhaṁḍum̐ḍaunu