Mahi mellaam doppam domge majjanavela

మహి మెల్లాఁ దొప్పఁ దోఁగె మజ్జనవేళ
Language

(॥పల్లవి॥)
మహి మెల్లాఁ దొప్పఁ దోఁగె మజ్జనవేళ
సహజ శృంగారాలు జడిసె శ్రీపతికి

(॥మహి॥)
ముత్తేలవాన లెల్ల ముంచి కురిసినయట్టు
హత్తి పన్నీట జలకమాయ హరికి
తత్తరానఁ దెల్ల మొయిలు తనుఁ బొదిగినయటు
కొత్తగాఁ గప్పురకాపు గుప్పిరి దేవునికి

(॥మహి॥)
నీలపుఁ బేరు లెల్లా నిండాఁ గట్టినయట్టు
తేలఁ దట్టుపుణుఁగు మెత్తిరి పతికి
ఆతరి మెఱుఁగుఁ దీగె లలముకొనినయట్టు
కోలుముందై సొమ్ములెల్లా గుప్పిరి విష్ణునికి

(॥మహి॥)
పెక్కు నవరత్నములు పెద్దరాసి వొసినట్టు
యెక్కువ దండలు గట్టిరి మూరితికి
వొక్కట నలమేలుమంగ నురమునఁ గట్టి రిదె
చిక్కని నవ్వులు మించె శ్రీవేంకటేశునకు

(||pallavi||)
mahi mĕllām̐ dŏppam̐ dom̐gĕ majjanaveḽa
sahaja śhṛṁgārālu jaḍisĕ śhrībadigi

(||mahi||)
muttelavāna lĕlla muṁchi kurisinayaṭṭu
hatti pannīḍa jalagamāya harigi
tattarānam̐ dĕlla mŏyilu tanum̐ bŏdiginayaḍu
kŏttagām̐ gappuragābu guppiri devunigi

(||mahi||)
nīlabum̐ beru lĕllā niṁḍām̐ gaṭṭinayaṭṭu
telam̐ daṭṭubuṇum̐gu mĕttiri padigi
ādari mĕṟum̐gum̐ dīgĕ lalamugŏninayaṭṭu
kolumuṁdai sŏmmulĕllā guppiri viṣhṇunigi

(||mahi||)
pĕkku navaratnamulu pĕddarāsi vŏsinaṭṭu
yĕkkuva daṁḍalu gaṭṭiri mūridigi
vŏkkaḍa nalamelumaṁga nuramunam̐ gaṭṭi ridĕ
sikkani navvulu miṁchĕ śhrīveṁkaḍeśhunagu