Title (Indic)ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ WorkMahathma Year2009 LanguageTelugu Credits Role Artist Music Vijay Antony Performer Balasubramaniam S.P. Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సమ్మతి దే భగవాన్ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ చరణం 1: రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆ చరిత... కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాతా... మనలాగే ఓ కన్న తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ... మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి... సత్యా హింసల మార్గాజ్యోతి.. నవశకానికే నాంది.. రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సమ్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్కో సమ్మతి దే భగవాన్ చరణం 2: గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత..ఆ సిసలైన జగజ్జేత... చరకాయంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి.. నూలుపోగుతో మదపటేనుగుల బంధించాడుర జాతిపిత..ఆ సంకల్ప బలం చేత... సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చుపిన క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత క్రాంతి పదవులు కోరని పావన మూర్తి.. హృదయాలేలిన చక్రవర్తి.. ఇలాంటి నరుడొక డిలాటలంపై నడియాడిన ఈనాటి సంగతి నమ్మరాదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి సర్వజన హితం నా మతం అంటరానితనాన్నీ అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం... హే రాం! Englishpallavi: raghubadi rāghava rājarāṁ padida pāvana sīdārāṁ īśhvar allā tero nāṁ sabko sammadi de bhagavān iṁdiramma iṁṭi peru kādura gāṁdhī ūrigŏkka vīdhi peru kādura gāṁdhī iṁdiramma iṁṭi peru kādura gāṁdhī ūrigŏkka vīdhi peru kādura gāṁdhī karĕnsī noḍu mīda ilā naḍi roḍḍu mīda manaṁ sūstunna bŏmma kādura gāṁdhī bharadamāda talarādanu mārsina vidhādarā gāṁdhī taradarāla yama yādana tīrsina varadādara gāṁdhī iṁdiramma iṁṭi peru kādura gāṁdhī ūrigŏkka vīdhi peru kādura gāṁdhī saraṇaṁ 1: rāmanāmame talabaṁtā prema dhāmame manasaṁtā āśhrama dīkṣha svadaṁtra kāṁkṣha ākṛti dālsina avadhūda aburūbaṁ ā sarida... karmayogame janmaṁtā dharmakṣhetrame bradugaṁtā saṁbhavāmi yani pragaḍiṁchina alanāḍi kṛṣhṇa bhagavadgīda ī bosi noḍi tādā... manalāge o kanna talli kanna māmūlu maniṣhi kadarā gāṁdhī... mahātmuḍaṁṭū mannana pŏṁde sthāyigi pĕṁchada āyana spūrdi... satyā hiṁsala mārgājyodi.. navaśhagānige nāṁdi.. raghubadi rāghava rājarāṁ padida pāvana sīdārāṁ īśhvar allā tero nāṁ sabko sammadi de bhagavān raghubadi rāghava rājarāṁ padida pāvana sīdārāṁ īśhvar allā tero nāṁ sabko sammadi de bhagavān saraṇaṁ 2: guppĕḍu uppunu pogesi nippula uppĕnagā sesi daṁḍiyātrane daṁḍayātragā muṁdugu naḍibina adhineda..ā sisalaina jagajjeda... saragāyaṁtraṁ sūbiṁchi svadeśhi sūtraṁ nerbiṁchi.. nūlubogudo madabaḍenugula baṁdhiṁchāḍura jādibida..ā saṁkalba balaṁ seda... sūryuḍastamiṁchani rājyānigi paḍamara dārini subina krāṁti tūrubu tĕllārani naḍirātrigi svechchhābhānuḍi prabhāda krāṁti padavulu korani pāvana mūrdi.. hṛdayālelina sakravardi.. ilāṁṭi naruḍŏga ḍilāḍalaṁpai naḍiyāḍina īnāḍi saṁgadi nammarādani nammagamuṁde muṁdudarālagi sĕppaṁḍi sarvajana hidaṁ nā madaṁ aṁṭarānidanānnī aṁtaḥkalahālani aṁtaṁ seseṁduge nā āyuvaṁtā aṁkidaṁ... he rāṁ!