మగువరో యీగతినే మగని వలపించవే
(॥పల్లవి॥)
మగువరో యీగతినే మగని వలపించవే
జిగి మఱవకుమీ నేఁ జెప్పిన యీ బుద్దులు
(॥మగు॥)
మనసు లెనసితేను మాటలెల్లాఁ జపులౌను
ననుపు గలిగితేను నవ్వులు వచ్చు
చనవుమెరసితేను సంగాతము లీడేరు
వినయము చూపితే వేడుకలౌఁ బొందులు
(॥మగు॥)
అడియాసలు మించితే ఆయములు గరఁగును
యెడవాయకుండితేను హెచ్చు లంకెలు
వుడివోనిప్రేమలైతే వొనరుఁ దలపోఁతలు
అడరుఁ జుట్టరికములైతే నింపు లెసఁగు
(॥మగు॥)
విచ్చన విళ్తైతేను వలెయుఁ దమకములు
ముచ్చటలు నెరపితే ముంచుఁ గళలు
ఇచ్చట శ్రీవేంకటేశుఁడేలే నిన్ను నింతలోనె
పచ్చిదేరఁ జెనకితిఁ బరగును రతులు
(||pallavi||)
maguvaro yīgadine magani valabiṁchave
jigi maṟavagumī nem̐ jĕppina yī buddulu
(||magu||)
manasu lĕnasidenu māḍalĕllām̐ jabulaunu
nanubu galigidenu navvulu vachchu
sanavumĕrasidenu saṁgādamu līḍeru
vinayamu sūbide veḍugalaum̐ bŏṁdulu
(||magu||)
aḍiyāsalu miṁchide āyamulu garam̐gunu
yĕḍavāyaguṁḍidenu hĕchchu laṁkĕlu
vuḍivonipremalaide vŏnarum̐ dalabom̐talu
aḍarum̐ juṭṭarigamulaide niṁpu lĕsam̐gu
(||magu||)
vichchana viḽtaidenu valĕyum̐ damagamulu
muchchaḍalu nĕrabide muṁchum̐ gaḽalu
ichchaḍa śhrīveṁkaḍeśhum̐ḍele ninnu niṁtalonĕ
pachchideram̐ jĕnagidim̐ baragunu radulu