మగువరో సిగ్గువడను మరి వేళ లేదా
(॥పల్లవి॥)
మగువరో సిగ్గువడను మరి వేళ లేదా
నిగిడి కూడఁగాను నీ కిప్పుడు వలెనా
(॥మగు॥)
చెక్కు నొక్కి పతి నిన్నుఁజేరి వేఁడుకొనఁగాను
మొక్కఁగదే చేతులెత్తి మొరఁగులేల
చక్కని నీమోమెత్తి సారె నిన్నుఁ జూడఁ గాను
అక్కరతో నవ్వఁగదే యణఁచుకోనేలా
(॥మగు॥)
పెనఁగి యాతఁడు నీకు ప్రియములు చెప్పఁగాను
తనియ వె వియ్యఁగదే దాఁచుకోనేల
చనవిచ్చి యప్పటిని సరసము లాడఁగాను
ననిచి మాఁటాడఁగదే నాలితనమేలా
(॥మగు॥)
చేరి నీచనుగుబ్బలు శ్రీవేంకటేశుఁ డంటఁగా
కోరి కాఁగిలించఁగదే కొంకఁగనేల
వేరు సేయక నిన్నేలి వేడుకతోఁ గూడఁగాను
వూరకే విడె మీఁగదే వుమ్మగినేలా
(||pallavi||)
maguvaro sigguvaḍanu mari veḽa ledā
nigiḍi kūḍam̐gānu nī kippuḍu valĕnā
(||magu||)
sĕkku nŏkki padi ninnum̐jeri vem̐ḍugŏnam̐gānu
mŏkkam̐gade sedulĕtti mŏram̐gulela
sakkani nīmomĕtti sārĕ ninnum̐ jūḍam̐ gānu
akkarado navvam̐gade yaṇam̐sugonelā
(||magu||)
pĕnam̐gi yādam̐ḍu nīgu priyamulu sĕppam̐gānu
taniya vĕ viyyam̐gade dām̐sugonela
sanavichchi yappaḍini sarasamu lāḍam̐gānu
nanisi mām̐ṭāḍam̐gade nālidanamelā
(||magu||)
seri nīsanugubbalu śhrīveṁkaḍeśhum̐ ḍaṁṭam̐gā
kori kām̐giliṁcham̐gade kŏṁkam̐ganela
veru seyaga ninneli veḍugadom̐ gūḍam̐gānu
vūrage viḍĕ mīm̐gade vummaginelā