మగువరో ఇందుకే నీ మగఁడు వెూహించినాఁడు
(॥పల్లవి॥)
మగువరో ఇందుకే నీ మగఁడు వెూహించినాఁడు
పగటున రాఁ గదవే బాఁతిపడీని
(॥॥)
కప్పురాల వంటినీ కందువ పలుకులనే
దప్పిదేరి తమకము దై లువారీని
రెప్పలచూపులలో మీరిన మెరుఁగులనే
కుప్పళింపు వలపులు గురులయ్యీని
(॥॥)
బంగారు నిగ్గులు దేరే బాహు మూలపు కాంతుల
కంగవించి వొడిగట్టి యాసగించీని
కుంగని నీవురము పై కుచదుర్గములనే
సంగతిఁ దావు సేసుక సంతోసించీని
(॥॥)
తేటలై ననీమోవితేనెలవిందుల కే
వాటముగ నోరూరి వచ్చియున్నాఁడు
మేటి శ్రీ వేంకటేశుఁ డు మెచ్చి నీకాఁగిటఁ గూడి
కోటికోటిరతులఁ జొక్కుచు నవ్వీని
(||pallavi||)
maguvaro iṁduge nī magam̐ḍu vĕూhiṁchinām̐ḍu
pagaḍuna rām̐ gadave bām̐tibaḍīni
(||||)
kappurāla vaṁṭinī kaṁduva palugulane
dappideri tamagamu dai luvārīni
rĕppalasūbulalo mīrina mĕrum̐gulane
kuppaḽiṁpu valabulu gurulayyīni
(||||)
baṁgāru niggulu dere bāhu mūlabu kāṁtula
kaṁgaviṁchi vŏḍigaṭṭi yāsagiṁchīni
kuṁgani nīvuramu pai kusadurgamulane
saṁgadim̐ dāvu sesuga saṁtosiṁchīni
(||||)
teḍalai nanīmovidenĕlaviṁdula ke
vāḍamuga norūri vachchiyunnām̐ḍu
meḍi śhrī veṁkaḍeśhum̐ ḍu mĕchchi nīgām̐giḍam̐ gūḍi
koḍigoḍiradulam̐ jŏkkusu navvīni