Maguvanu dayamjoodu magabaadi

మగువను దయఁజూడు మగపాడి
Language

(॥పల్లవి॥)
మగువను దయఁజూడు మగపాడి
యిగురుమోవి యిచ్చుటిది మగపాడి

(॥మగువ॥)
చెక్కిటి చేతితోడి చెలి సిగ్గుదేరిచి
మక్కువ సేయించుకుంటే మగపాడి
అక్కజపు విరహన నసురుసురై యుండఁగ
ఇక్కువలంటి మన్నించుటిది మగపాడి

(॥మగువ॥)
చినుకుఁ జెమట మేని చింతతోడ నున్న దాని
మనసు రంజిలించుటే మగపాడి
తనివోని కోరికతో తలవంచుకుండగాను
యెనసి నవ్వు నవ్వించుటిది మగపాడి

(॥మగువ॥)
చాటుచు నీకుఁ బియాలు సారెసారె జెప్పఁగాను
మాటలాలించి వినుటే మగపాడి
ఆఁటదని చిత్తగించి అట్టే యీకెఁ గూడితివి
యీటున శ్రీవేంకటేశ యిది మగపాడి

(||pallavi||)
maguvanu dayam̐jūḍu magabāḍi
yigurumovi yichchuḍidi magabāḍi

(||maguva||)
sĕkkiḍi sedidoḍi sĕli sigguderisi
makkuva seyiṁchuguṁṭe magabāḍi
akkajabu virahana nasurusurai yuṁḍam̐ga
ikkuvalaṁṭi manniṁchuḍidi magabāḍi

(||maguva||)
sinugum̐ jĕmaḍa meni siṁtadoḍa nunna dāni
manasu raṁjiliṁchuḍe magabāḍi
tanivoni korigado talavaṁchuguṁḍagānu
yĕnasi navvu navviṁchuḍidi magabāḍi

(||maguva||)
sāḍusu nīgum̐ biyālu sārĕsārĕ jĕppam̐gānu
māḍalāliṁchi vinuḍe magabāḍi
ām̐ṭadani sittagiṁchi aṭṭe yīgĕm̐ gūḍidivi
yīḍuna śhrīveṁkaḍeśha yidi magabāḍi