మగువమాటలే గురుమంత్రము నీకు
(॥పల్లవి॥)
మగువమాటలే గురుమంత్రము నీకు
వెగటుదీర నివి విన్నవించదాయనా
(॥మగువ॥)
కాంతలు గోపగించితే కడుఁ బచ్చిసేతురని
చెంతల నాకె బుద్ధి చెప్పదాయనా
మంతనమైనప్పుడే మనసు గరఁతురని
వింత నీమంకుఁదనము విడిపించదాయనా
(॥మగువ॥)
సరసమాడేటివేళ చలము సాదింతురని
నిరతితో నీకు నీతి నేర్పదాయనా
మరిగితేఁ దమకము మరియును రేఁతురని
పరగ నీకితవుగాఁ బట్టించదాయనా
(॥మగువ॥)
కూడినట్టి రతివేళ కొప్పువట్టి తీతురని
వాడికైన నీగుణము వంచదాయనా
యీడనే శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
వోడక నీకు వంకలొత్తదాయనా
(||pallavi||)
maguvamāḍale gurumaṁtramu nīgu
vĕgaḍudīra nivi vinnaviṁchadāyanā
(||maguva||)
kāṁtalu gobagiṁchide kaḍum̐ bachchisedurani
sĕṁtala nāgĕ buddhi sĕppadāyanā
maṁtanamainappuḍe manasu garam̐turani
viṁta nīmaṁkum̐danamu viḍibiṁchadāyanā
(||maguva||)
sarasamāḍeḍiveḽa salamu sādiṁturani
niradido nīgu nīdi nerbadāyanā
marigidem̐ damagamu mariyunu rem̐turani
paraga nīgidavugām̐ baṭṭiṁchadāyanā
(||maguva||)
kūḍinaṭṭi radiveḽa kŏppuvaṭṭi tīdurani
vāḍigaina nīguṇamu vaṁchadāyanā
yīḍane śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
voḍaga nīgu vaṁkalŏttadāyanā