Maguvalagum badulagunu tolle marumdu vraasinavraamta livi yee

మగువలకుఁ బతులకును తొల్లె మరుఁడు వ్రాసినవ్రాఁత లివి యీ
Language

(॥పల్లవి॥)
మగువలకుఁ బతులకును తొల్లె మరుఁడు వ్రాసినవ్రాఁత లివి యీ-
తగులు గలిగినవారికే భువిఁ దారుకాణవుఁ గాక

(॥మగు॥)
మచ్చికలుసతమైనవారికి మఱవు లేడవి యెంచిచూడఁగ
విచ్చనవీళ్ళయినవారికి వెఱపు లేలుండు
యిచ్చకములలవడినవారికి యెగ్గుసిగ్గులు వెదకనేఁటికి
చెచ్చెరను సేసినవెచేఁతలు చెల్లుబళ్ళవుఁగాక

(॥మగు॥)
మనసులేకములయినవారికి మరియు సంశయమేల కలుగును
వినయములు నేరిచినవారికి వెగటులే లేవు
చనవులనె పెనఁగేటివారికి సరసవేళలఁ గొంకవలవదు
ఆనుఁగుఁ బ్రియముల నాడినవియే ఆట లవుఁగాక

(॥మగు॥)
పాందులకు లోనయినవారికి పొలయలుక లవి యేల చెందును
యెందు గపటములేని వారికి నీసులే రావు
కందువల శ్రీవేంకటశునింగలసి పాయకవున్న వారికి
యిందరికి రతిఁ బలుకుఁ బంతము లేకమవుఁగాక

(||pallavi||)
maguvalagum̐ badulagunu tŏllĕ marum̐ḍu vrāsinavrām̐ta livi yī-
tagulu galiginavārige bhuvim̐ dārugāṇavum̐ gāga

(||magu||)
machchigalusadamainavārigi maṟavu leḍavi yĕṁchisūḍam̐ga
vichchanavīḽḽayinavārigi vĕṟabu leluṁḍu
yichchagamulalavaḍinavārigi yĕggusiggulu vĕdaganem̐ṭigi
sĕchchĕranu sesinavĕsem̐talu sĕllubaḽḽavum̐gāga

(||magu||)
manasulegamulayinavārigi mariyu saṁśhayamela kalugunu
vinayamulu nerisinavārigi vĕgaḍule levu
sanavulanĕ pĕnam̐geḍivārigi sarasaveḽalam̐ gŏṁkavalavadu
ānum̐gum̐ briyamula nāḍinaviye āḍa lavum̐gāga

(||magu||)
pāṁdulagu lonayinavārigi pŏlayaluga lavi yela sĕṁdunu
yĕṁdu gabaḍamuleni vārigi nīsule rāvu
kaṁduvala śhrīveṁkaḍaśhuniṁgalasi pāyagavunna vārigi
yiṁdarigi radim̐ balugum̐ baṁtamu legamavum̐gāga