మగువలాలా సందిమాట లేలే యింకా
(॥పల్లవి॥)
మగువలాలా సందిమాట లేలే యింకా
తగిలేయట్టి మేలు తడవూ గాదే
(॥మగువ॥)
మనసు మనసుఁ గూడె మచ్చికయితేఁ జాలు
తనువుఁ దనువుఁ దానె తగుల మౌనె
చనవు విచ్చి తామే జాణ లైతేఁ జాలు
పొనుఁగ నిండు మరుఁడు పూటకాఁపే
(॥మగువ॥)
పెలువూ నిలుపూఁ దమకే ప్రియములైతేఁ జాలు
చలిమి బలిమీ నట్టే సతము లౌనే
అలుకలేనికూట మమరి వుంటేఁ జాలు
తలిరువంటి వయసు తరవుకాఁడే
(॥మగువ॥)
అదనూఁ బదనూ నెఱిఁగి అండ నుంటేఁ జాలు
చదురుఁ బదురు నొక్క సమ్మ తౌనే
కదిసి కూడె శ్రీవేంకటవిభుఁడూఁనన్ను
చెదరెకుండే యాస సేసపాలే
(||pallavi||)
maguvalālā saṁdimāḍa lele yiṁkā
tagileyaṭṭi melu taḍavū gāde
(||maguva||)
manasu manasum̐ gūḍĕ machchigayidem̐ jālu
tanuvum̐ danuvum̐ dānĕ tagula maunĕ
sanavu vichchi tāme jāṇa laidem̐ jālu
pŏnum̐ga niṁḍu marum̐ḍu pūḍagām̐pe
(||maguva||)
pĕluvū nilubūm̐ damage priyamulaidem̐ jālu
salimi balimī naṭṭe sadamu laune
alugalenigūḍa mamari vuṁṭem̐ jālu
taliruvaṁṭi vayasu taravugām̐ḍe
(||maguva||)
adanūm̐ badanū nĕṟim̐gi aṁḍa nuṁṭem̐ jālu
sadurum̐ baduru nŏkka samma taune
kadisi kūḍĕ śhrīveṁkaḍavibhum̐ḍūm̐nannu
sĕdarĕguṁḍe yāsa sesabāle