మగువలాల బుద్దు లీమానినికిఁ జెప్పరే
(॥పల్లవి॥)
మగువలాల బుద్దు లీమానినికిఁ జెప్పరే
యెగసక్కెముల యాపె యేల వచ్చె నీడకు
(॥॥)
మంతనాన విభుఁడు నామర్మములు చెనకితే
చెంతనున్న తానేల సిగ్గువడీనే
వంతులకు మాలోన వలపులు చల్లుకొంటే
ఇంత కతకారియాపె యేలవచ్చె నీడకు
(॥॥)
జడిగొని పతి నాతో సరసము లాడఁగాను
నడుమనుండి తానేల నవ్వు నవ్వీనే
తడఁబడి మాలో నేము తమకానఁ బెనఁగితే
యెడపులరట్టడాపె యేలవచ్చె నీడకు
(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నన్నుఁ జేరి కాఁగిలించఁగాను
ఆవల నుండి తానేల అంటవచ్చీనే
చేవమీర మాలో నేము సేసలువెట్టుకోఁగా
యీవేళ బిత్తరియాపె యేలవచ్చె నీడకు
(||pallavi||)
maguvalāla buddu līmāninigim̐ jĕppare
yĕgasakkĕmula yābĕ yela vachchĕ nīḍagu
(||||)
maṁtanāna vibhum̐ḍu nāmarmamulu sĕnagide
sĕṁtanunna tānela sigguvaḍīne
vaṁtulagu mālona valabulu sallugŏṁṭe
iṁta kadagāriyābĕ yelavachchĕ nīḍagu
(||||)
jaḍigŏni padi nādo sarasamu lāḍam̐gānu
naḍumanuṁḍi tānela navvu navvīne
taḍam̐baḍi mālo nemu tamagānam̐ bĕnam̐gide
yĕḍabularaṭṭaḍābĕ yelavachchĕ nīḍagu
(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐ jeri kām̐giliṁcham̐gānu
āvala nuṁḍi tānela aṁṭavachchīne
sevamīra mālo nemu sesaluvĕṭṭugom̐gā
yīveḽa bittariyābĕ yelavachchĕ nīḍagu