మగువకుఁ బతితోడ మందెమేళ మింత యేలే
(॥పల్లవి॥)
మగువకుఁ బతితోడ మందెమేళ మింత యేలే
తగిలి మంచితనాన దక్కఁగొనవలదా
(॥మగు॥)
నీకొలఁదివారమా నీ యంత నేరమా
యాకడ నీపగటులు యెట్టు చూపేవే
కాకరినవ్వు లెంతేసే గబ్బితనా లిదియేమే
చేకొని పతిముందర సిగ్గువడ వలదా
(॥మగు॥)
దేవులము నేమూఁ గామా దీకొనఁగ నోపమా
చేవదేర నెమ్మెలేమి చెప్పుకొనేవే
కావరపుమాఁట లెన్నే కత లెంత నేరుతువే
వేవేలైనా పతివద్ద వినయమే వలదా
(॥మగు॥)
సవతులము గామా జాణతనా లెఱఁగమా
జవళి సలిగెలేల సారెఁ బెంచేవే
యిల శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్నుఁగూడె
కవగూడి పతి కిచ్చకమే సేయవలదా
(||pallavi||)
maguvagum̐ badidoḍa maṁdĕmeḽa miṁta yele
tagili maṁchidanāna dakkam̐gŏnavaladā
(||magu||)
nīgŏlam̐divāramā nī yaṁta neramā
yāgaḍa nībagaḍulu yĕṭṭu sūbeve
kāgarinavvu lĕṁtese gabbidanā lidiyeme
segŏni padimuṁdara sigguvaḍa valadā
(||magu||)
devulamu nemūm̐ gāmā dīgŏnam̐ga nobamā
sevadera nĕmmĕlemi sĕppugŏneve
kāvarabumām̐ṭa lĕnne kada lĕṁta neruduve
vevelainā padivadda vinayame valadā
(||magu||)
savadulamu gāmā jāṇadanā lĕṟam̐gamā
javaḽi saligĕlela sārĕm̐ bĕṁcheve
yila śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannum̐gūḍĕ
kavagūḍi padi kichchagame seyavaladā