Maguvagu ninniyunu mamchivai yumdamgavale

మగువకు నిన్నియును మంచివై యుండఁగవలె
Language

(॥పల్లవి॥)
మగువకు నిన్నియును మంచివై యుండఁగవలె
తగులై యుండఁజేయరే తరుణులాల

(॥మగు॥)
సుదతికిఁ దుమ్మిదలు చుట్టములై యుండవలె
పొదిగి తామరలు కొప్పున నించరే
వదలక చందురుని వసముసేసుకోవలె
పదిలానఁ గలువల పానుపు వరచరే

(॥మగు॥)
మందానిలుఁ డింతికి మరి చలువగావలె
గందము మేను నిండాఁ గడు మెత్తరే
చెంది కోవిలలతోడఁ జెలిమిసేసుకోవలె
చందముగాఁ జిగురాకు చప్పరలు గట్టరే

(॥మగు॥)
కలికికి మదనుఁడు కాఁపుగా నుండఁగవలె
చిలుకల వాసిన చీర గట్టరే
యెలిమి శ్రీవేంకటేశుఁ డీఁకె నింతలోఁగూడె
వెలయవలె సోబాన వేడుకతోఁ బాడరే

(||pallavi||)
maguvagu ninniyunu maṁchivai yuṁḍam̐gavalĕ
tagulai yuṁḍam̐jeyare taruṇulāla

(||magu||)
sudadigim̐ dummidalu suṭṭamulai yuṁḍavalĕ
pŏdigi tāmaralu kŏppuna niṁchare
vadalaga saṁduruni vasamusesugovalĕ
padilānam̐ galuvala pānubu varasare

(||magu||)
maṁdānilum̐ ḍiṁtigi mari saluvagāvalĕ
gaṁdamu menu niṁḍām̐ gaḍu mĕttare
sĕṁdi kovilaladoḍam̐ jĕlimisesugovalĕ
saṁdamugām̐ jigurāgu sapparalu gaṭṭare

(||magu||)
kaligiki madanum̐ḍu kām̐pugā nuṁḍam̐gavalĕ
silugala vāsina sīra gaṭṭare
yĕlimi śhrīveṁkaḍeśhum̐ ḍīm̐kĕ niṁtalom̐gūḍĕ
vĕlayavalĕ sobāna veḍugadom̐ bāḍare