మగువా నీవూ నొక్కటే మమ్ము నలయించనేల
(॥పల్లవి॥)
మగువా నీవూ నొక్కటే మమ్ము నలయించనేల
యెగసక్కేలు చెలులే యింతసేసి రందురు
(॥॥)
చేయివట్టి తియ్యఁగాను చెల్లఁబో జాగుసేసేవు
వేయిటికివి చెలికి విన్నవింతుమా
ఆయెడ నెదురుచూచీ అంగన మాసుద్దులకు
పాయక ఆనతీవయ్య పరాకులేమిటికి
(॥॥)
ఆనవెట్టి పిలువఁగ నంగనలతో నవ్వేవు
వైసవై నాలుగ నన్ని వ్రాసెంపుదమా
మానవతి లోననుండి మరీ దూతికం నంపె
దానికేమనే వయ్య యీతరి గుట్టేమిటికి
(॥॥)
వొత్తరించుకొని రాఁగా నువిద నిట్టే కూడితి-
విత్తల శ్రీవేంకటేశ యెచ్చరింతుమా
తత్తరానఁ గమ్మటిని తరుణి సన్నలు సేసీ
చిత్తగించి యేలవయ్య సిగ్గులిప్పు డేఁటికి
(||pallavi||)
maguvā nīvū nŏkkaḍe mammu nalayiṁchanela
yĕgasakkelu sĕlule yiṁtasesi raṁduru
(||||)
seyivaṭṭi tiyyam̐gānu sĕllam̐bo jāgusesevu
veyiḍigivi sĕligi vinnaviṁtumā
āyĕḍa nĕdurusūsī aṁgana māsuddulagu
pāyaga ānadīvayya parāgulemiḍigi
(||||)
ānavĕṭṭi piluvam̐ga naṁganalado navvevu
vaisavai nāluga nanni vrāsĕṁpudamā
mānavadi lonanuṁḍi marī dūdigaṁ naṁpĕ
dānigemane vayya yīdari guṭṭemiḍigi
(||||)
vŏttariṁchugŏni rām̐gā nuvida niṭṭe kūḍidi-
vittala śhrīveṁkaḍeśha yĕchchariṁtumā
tattarānam̐ gammaḍini taruṇi sannalu sesī
sittagiṁchi yelavayya siggulippu ḍem̐ṭigi