మగువ యెంతటిదైనా మగవానికిఁ గిరుదే । యీ
(॥పల్లవి॥)
మగువ యెంతటిదైనా మగవానికిఁ గిరుదే । యీ-
తగవు నీ వెఱిఁగి యీతనికి మొక్కఁగదే
(॥మగు॥)
మంచి మాటాడితేఁ బతిమనసు గరఁగుఁగాక
ఇంచుక నిష్టూరమైన ఇయ్యకోలౌనా
వంచన కలిగితేనే వాడిక లింపవుఁగాక
మించి నడవఁగఁబోతే మెరమెర వుట్టదా
(॥మగు॥)
సరసములాడితేను చవులెల్లాఁ బొడముఁగాక
విరసాన నుండితేను వేడుకలౌనా
మరుగఁజేసుకొంటేను మచ్చిక నిలుచుఁగాక
యెరవుసేసుకుండితే నెనయునా పొందులు
(॥మగు॥)
ముందరినే నవ్వితేను మొగమోట వుట్టుఁగాక
సందడిఁ దలవంచితి సమ్మతులౌనా
అంది నలమేల్ మంగ వాతఁడు శ్రీవేంకటేశుఁ
డిందు నిన్నుఁ గూడె నిఁక నిచ్చకమే మించదా
(||pallavi||)
maguva yĕṁtaḍidainā magavānigim̐ girude | yī-
tagavu nī vĕṟim̐gi yīdanigi mŏkkam̐gade
(||magu||)
maṁchi māḍāḍidem̐ badimanasu garam̐gum̐gāga
iṁchuga niṣhṭūramaina iyyagolaunā
vaṁchana kaligidene vāḍiga liṁpavum̐gāga
miṁchi naḍavam̐gam̐bode mĕramĕra vuṭṭadā
(||magu||)
sarasamulāḍidenu savulĕllām̐ bŏḍamum̐gāga
virasāna nuṁḍidenu veḍugalaunā
marugam̐jesugŏṁṭenu machchiga nilusum̐gāga
yĕravusesuguṁḍide nĕnayunā pŏṁdulu
(||magu||)
muṁdarine navvidenu mŏgamoḍa vuṭṭum̐gāga
saṁdaḍim̐ dalavaṁchidi sammadulaunā
aṁdi nalamel maṁga vādam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍiṁdu ninnum̐ gūḍĕ nim̐ka nichchagame miṁchadā