మగువ యప్పటనుండి మనికితమున నవ్వీ
(॥పల్లవి॥)
మగువ యప్పటనుండి మనికితమున నవ్వీ
అగడేల లోపలికి నంకెల రారాదా
(॥మగువ॥)
యిల్లాలయినదాని నిందరిలోపల నీవు
పల్లదపు మాటలాడి పచ్చిసేతురా
చెల్లఁబో ఆఁటదానికి సిగ్గు విడువఁ దగవా
కల్లరివై యింత నీవు కాకుసేయవలదు
(॥మగువ॥)
పీఁటపైఁ బెండ్లికూఁతురుఁ బేరటాండ్లలోన నెల్లా
వాఁటముగఁ బయ్యదంటి వాసిసేతురా
మేఁటి యాఁటదానికి మేరమీరఁ దగవా
గాఁటముగ నీవింత కాకుసేయవలదు
(॥మగువ॥)
పట్టిపుదేవులఁ దెచ్చి పడఁతులలోన నెల్లా
జట్టిగొని మోవితేనె చవి చూపేవు
అట్టే కూడితివి మగనాలికి రట్టు దగవా
గట్టిగా శ్రీవేంకటేశ కాకుసేయవలదు
(||pallavi||)
maguva yappaḍanuṁḍi manigidamuna navvī
agaḍela lobaligi naṁkĕla rārādā
(||maguva||)
yillālayinadāni niṁdarilobala nīvu
palladabu māḍalāḍi pachchisedurā
sĕllam̐bo ām̐ṭadānigi siggu viḍuvam̐ dagavā
kallarivai yiṁta nīvu kāguseyavaladu
(||maguva||)
pīm̐ṭabaim̐ bĕṁḍligūm̐turum̐ beraḍāṁḍlalona nĕllā
vām̐ṭamugam̐ bayyadaṁṭi vāsisedurā
mem̐ṭi yām̐ṭadānigi meramīram̐ dagavā
gām̐ṭamuga nīviṁta kāguseyavaladu
(||maguva||)
paṭṭibudevulam̐ dĕchchi paḍam̐tulalona nĕllā
jaṭṭigŏni movidenĕ savi sūbevu
aṭṭe kūḍidivi maganāligi raṭṭu dagavā
gaṭṭigā śhrīveṁkaḍeśha kāguseyavaladu