మగువ నేమీ నెఱఁగ మన్నించవయ్యా
(॥పల్లవి॥)
మగువ నేమీ నెఱఁగ మన్నించవయ్యా
అగడుసేసి నన్ను ఆయాలంటవలెనా
(॥మగు॥)
వాలుకచూపులు నీపై వంచఁజాలనంటినంటా
యేల నీవు నాశిరసెత్యేవయ్య
కాలు దాఁకీనంటా నిన్నుఁ గదిపి కూచుండఁజాల
పాలించి పయ్యదకొంగు పట్టి తియ్యవలెనా
(॥మగు॥)
సారెకు సెలవి నవ్వఁజాల భ్రమసేవంటా
కేరడాన యేల గిలిగేంచేవయ్య
దూరనేల నిన్నంటా తొడఁగి మాటాడఁజాల
మేరనుండవయ్య మందెమేళ మింత వలెనా
(॥మగు॥)
గక్కనఁ బెనఁగజాలఁ గడునలసేవంటా
ఇక్కువఁగూడితి రతి యింకా వలెనా
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
దక్కితివి నాపైని తమకము వలెనా
(||pallavi||)
maguva nemī nĕṟam̐ga manniṁchavayyā
agaḍusesi nannu āyālaṁṭavalĕnā
(||magu||)
vālugasūbulu nībai vaṁcham̐jālanaṁṭinaṁṭā
yela nīvu nāśhirasĕtyevayya
kālu dām̐kīnaṁṭā ninnum̐ gadibi kūsuṁḍam̐jāla
pāliṁchi payyadagŏṁgu paṭṭi tiyyavalĕnā
(||magu||)
sārĕgu sĕlavi navvam̐jāla bhramasevaṁṭā
keraḍāna yela giligeṁchevayya
dūranela ninnaṁṭā tŏḍam̐gi māḍāḍam̐jāla
meranuṁḍavayya maṁdĕmeḽa miṁta valĕnā
(||magu||)
gakkanam̐ bĕnam̐gajālam̐ gaḍunalasevaṁṭā
ikkuvam̐gūḍidi radi yiṁkā valĕnā
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
dakkidivi nābaini tamagamu valĕnā