మగువ నీవే మాతో మాటలే యాడవుగాని
(॥పల్లవి॥)
మగువ నీవే మాతో మాటలే యాడవుగాని
తగవాయఁ బనులెల్ల తనిసితి మమ్మా
(॥మగు॥)
పూచెఁ బూచె వెన్నెలలు పున్నమచంద్రుని వద్ద
రాచిలుకలందు దోఁచె రంతు వనాన
వీచె నిదె చల్లగాలి వేడుక ముంగిట నిదే
యేచి మరురాజ్యమాయ నేవి గడమమ్మా
(॥మగు॥)
కుందనపుజక్కవలు కుంకుమలే కురిసీని
ముందుముందె లతలను ముత్తేలువండె
కందువతో నాకసము గంటు వదలె నింతలో
కందువ నామని మించె గడమేఁటిదమ్మా
(॥మగు॥)
తుమ్మిదలు చెలరేఁగెఁ దొడరి యాడకాకడకు
వుమ్మడి నుగ్గుదేనియ లుట్టిపడెను
కొమ్మరొ శ్రీ వేంకటేశుకూట మిది గాఁబోలు
సమ్మతించితిమి మేము చాలదా వోయమ్మ
(||pallavi||)
maguva nīve mādo māḍale yāḍavugāni
tagavāyam̐ banulĕlla tanisidi mammā
(||magu||)
pūsĕm̐ būsĕ vĕnnĕlalu punnamasaṁdruni vadda
rāsilugalaṁdu dom̐sĕ raṁtu vanāna
vīsĕ nidĕ sallagāli veḍuga muṁgiḍa nide
yesi marurājyamāya nevi gaḍamammā
(||magu||)
kuṁdanabujakkavalu kuṁkumale kurisīni
muṁdumuṁdĕ ladalanu mutteluvaṁḍĕ
kaṁduvado nāgasamu gaṁṭu vadalĕ niṁtalo
kaṁduva nāmani miṁchĕ gaḍamem̐ṭidammā
(||magu||)
tummidalu sĕlarem̐gĕm̐ dŏḍari yāḍagāgaḍagu
vummaḍi nuggudeniya luṭṭibaḍĕnu
kŏmmarŏ śhrī veṁkaḍeśhugūḍa midi gām̐bolu
sammadiṁchidimi memu sāladā voyamma