Maguva lemta medainaa magavaanige lonu

మగువ లెంత మేటైనా మగవానికే లోను
Language

(॥పల్లవి॥)
మగువ లెంత మేటైనా మగవానికే లోను
తగవులు నెరపితే తప్పించుకొందురా

(॥మగు॥)
చెల్లుబడిగలవారు చేయివట్టి తీసితేను
పల్లదమాడుదురా పంతమా యిది
చల్లఁగా నలుకదీర జాజులు ముడిచితేను
తెల్లమిగాఁ గొప్పువట్టి తియ్యకుమందురా

(॥మగు॥)
కలపు కోలైనవారు కప్పురము చల్లితేను
బలిమి విదిలింతురా పంతమా యిది
కలపి బత్తితోడను కస్తూరి వూసితేను
అలమి మా చన్ను లంతేసి అంటకుమందురా

(॥మగు॥)
శ్రీ వేంకటేశ్వరుఁడు చెక్కునొక్కి కూడితేను
భావము సోదింతురా పంతమా యిది
మోవితేనె నీకు నిచ్చి మోహము నించితేను
చేవదేరీ నందు గంటి సేయకు మందురా

(||pallavi||)
maguva lĕṁta meḍainā magavānige lonu
tagavulu nĕrabide tappiṁchugŏṁdurā

(||magu||)
sĕllubaḍigalavāru seyivaṭṭi tīsidenu
palladamāḍudurā paṁtamā yidi
sallam̐gā nalugadīra jājulu muḍisidenu
tĕllamigām̐ gŏppuvaṭṭi tiyyagumaṁdurā

(||magu||)
kalabu kolainavāru kappuramu sallidenu
balimi vidiliṁturā paṁtamā yidi
kalabi battidoḍanu kastūri vūsidenu
alami mā sannu laṁtesi aṁṭagumaṁdurā

(||magu||)
śhrī veṁkaḍeśhvarum̐ḍu sĕkkunŏkki kūḍidenu
bhāvamu sodiṁturā paṁtamā yidi
movidenĕ nīgu nichchi mohamu niṁchidenu
sevaderī naṁdu gaṁṭi seyagu maṁdurā