Maguva gumpena neegu mamchidaayanu

మగువ గుంపెన నీకు మంచిదాయను
Language

(॥పల్లవి॥)
మగువ గుంపెన నీకు మంచిదాయను
తగవులఁ బెట్టఁగానే తమి రేఁగెను

(॥॥)
చలము సాదించేనంటా సతి నిన్ను జంకించితే
చెలరేఁగి లోలోనిసిగ్గు దేరెను
బలిమి నీవు సేయఁ గాఁ బట్టిపెనఁగఁ జూచితే
యెలమిఁ జన్నులపై పయ్యద జారెను

(॥॥)
తరితీపు సేసేనంటా తగుల మాటలాడితే
గొరబైనవలపు లుంకువలాయను
కెరలించేనంటా నిన్ను కెంగేలు వట్టితేను
సురతకాంక్షలకును చోటాయను

(॥॥)
కడునలయించేనంటా కాఁగిట బిగించితేను
జడిగొన్న వేడుకలు సతమాయను
అడరి శ్రీ వేంకటేశ అలమేలుమంగ యిట్టె
కడఁగి వురమెక్కితేఁ గాణాచి ఆయను

(||pallavi||)
maguva guṁpĕna nīgu maṁchidāyanu
tagavulam̐ bĕṭṭam̐gāne tami rem̐gĕnu

(||||)
salamu sādiṁchenaṁṭā sadi ninnu jaṁkiṁchide
sĕlarem̐gi lolonisiggu derĕnu
balimi nīvu seyam̐ gām̐ baṭṭibĕnam̐gam̐ jūside
yĕlamim̐ jannulabai payyada jārĕnu

(||||)
taridību sesenaṁṭā tagula māḍalāḍide
gŏrabainavalabu luṁkuvalāyanu
kĕraliṁchenaṁṭā ninnu kĕṁgelu vaṭṭidenu
suradagāṁkṣhalagunu soḍāyanu

(||||)
kaḍunalayiṁchenaṁṭā kām̐giḍa bigiṁchidenu
jaḍigŏnna veḍugalu sadamāyanu
aḍari śhrī veṁkaḍeśha alamelumaṁga yiṭṭĕ
kaḍam̐gi vuramĕkkidem̐ gāṇāsi āyanu