Maguva bhaavamu soosi mannimchavayyaa

మగువ భావము చూచి మన్నించవయ్యా
Language

(॥పల్లవి॥)
మగువ భావము చూచి మన్నించవయ్యా
వెగటుగా మోవితేనె విందువెట్టీని

(॥మగు॥)
చెక్కుమీఁదఁ జేయిపెట్టి సెలవుల నవ్వు నవ్వి
తక్కక తనమోహము దాచీఁ జెలి
పక్కనఁ బాపట దువ్వి పరాకులు పచరించి
గక్కనఁ దనసిగ్గులు గాదెఁ బోసీని

(॥మగు॥)
వాలుకరెప్పలు వంచి వదనానఁ గళరేఁచి
చాలా నీపైఁ దమకము జరపీఁ జెలి
తాలిమి వాట్టూర్పు చల్లి తలపోఁతలెల్లాఁ బెంచి
వోలిఁ దనయాసలెల్లా వొడిఁగట్టుకొనీని

(॥మగు॥)
పయ్యద జారఁగఁదీసి పలుమారుఁగాఁగిలించి
నెయ్యమెల్లా నీమీఁద నెరపీఁజెలి
యియ్యెడ శ్రీవేంకటేశ యేలితివి యీకె నిట్టె
చయ్యన రతులెల్లాను జట్టి సేసీని

(||pallavi||)
maguva bhāvamu sūsi manniṁchavayyā
vĕgaḍugā movidenĕ viṁduvĕṭṭīni

(||magu||)
sĕkkumīm̐dam̐ jeyibĕṭṭi sĕlavula navvu navvi
takkaga tanamohamu dāsīm̐ jĕli
pakkanam̐ bābaḍa duvvi parāgulu pasariṁchi
gakkanam̐ danasiggulu gādĕm̐ bosīni

(||magu||)
vālugarĕppalu vaṁchi vadanānam̐ gaḽarem̐si
sālā nībaim̐ damagamu jarabīm̐ jĕli
tālimi vāṭṭūrbu salli talabom̐talĕllām̐ bĕṁchi
volim̐ danayāsalĕllā vŏḍim̐gaṭṭugŏnīni

(||magu||)
payyada jāram̐gam̐dīsi palumārum̐gām̐giliṁchi
nĕyyamĕllā nīmīm̐da nĕrabīm̐jĕli
yiyyĕḍa śhrīveṁkaḍeśha yelidivi yīgĕ niṭṭĕ
sayyana radulĕllānu jaṭṭi sesīni