(॥పల్లవి॥)
మగవారితోడుత మగువకును
నిగిడి యెంతైనా మేలే నెరపుట గాక
(॥మగ॥)
మొగము చూచితేను మొక్కి వుండుట దగు
నగితేను కలసి పెనఁగఁ దగును
తగులు గలిగితేను దండనె కూచుండఁ దగు
యెగసక్కె మైతేను యేమి సేయవచ్చునే
(॥మగ॥)
మనసొగ్గి వింటేను మాటలాడఁగఁ దగు
ననుపు నడపితేను నవ్వఁగఁ దగు
చనవు లొసఁగితేను సరసము చూపఁదగు
తనంతఁ దానుంటే తమి యెట్టు రేఁచేదే
(॥మగ॥)
తడయక కూడితేను తరితీపు సేయఁదగు
జడియని పొందైతే సాదించఁదగు
అడరి శ్రీవెంకటేశుఁ డలమేల్‌మంగను నేను
కడఁగి నన్నేలె నిఁకఁ గాదనే దేఁటికే
(||pallavi||)
magavāridoḍuda maguvagunu
nigiḍi yĕṁtainā mele nĕrabuḍa gāga
(||maga||)
mŏgamu sūsidenu mŏkki vuṁḍuḍa dagu
nagidenu kalasi pĕnam̐gam̐ dagunu
tagulu galigidenu daṁḍanĕ kūsuṁḍam̐ dagu
yĕgasakkĕ maidenu yemi seyavachchune
(||maga||)
manasŏggi viṁṭenu māḍalāḍam̐gam̐ dagu
nanubu naḍabidenu navvam̐gam̐ dagu
sanavu lŏsam̐gidenu sarasamu sūbam̐dagu
tanaṁtam̐ dānuṁṭe tami yĕṭṭu rem̐sede
(||maga||)
taḍayaga kūḍidenu taridību seyam̐dagu
jaḍiyani pŏṁdaide sādiṁcham̐dagu
aḍari śhrīvĕṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
kaḍam̐gi nannelĕ nim̐kam̐ gādane dem̐ṭige