Magavaari kemti melu maraduru vegirame

మగవారి కేఁటి మేలు మరతురు వేగిరమే
Language

(॥పల్లవి॥)
మగవారి కేఁటి మేలు మరతురు వేగిరమే
బగి వాయకుండఁగానె పరా కె ట్టైతివిరా

(॥మగవారి॥)
ఆకె విలిచీ నంటా నట్టె విచ్చేసేవు గాని
పైకొని మా యింటికి రాఁ బాపమా నీకు
యీకడ నేఁ జూడఁగానె యించుకంత దయ లేక
కైకొని తోసి విచ్చేయఁ గాళ్లెట్లాడెరా

(॥మగవారి॥)
అల్లది వచ్చీ నంటా అక్కడ చూచేవు గాని
వొల్లనె మామొగ మైతే వొచ్చమా నీకు
తొల్లిటిదాననె నీతొడమీఁదఁ బండుండఁగ
మల్లడి యంతదవ్వు నీ మన సెట్టు వారెరా

(॥మగవారి॥)
మంతన మది యాడఁగ మరిఁ జె వొగ్గేవు గాని
కొంత నామాట వింటే కొరతా నీవు
చెంతల శ్రీవేంకటేశ చెప్పఁగా నన్నుఁ గూడితి
వంతలోనె నీగుణము అ దెట్టు దిరిగెరా

(||pallavi||)
magavāri kem̐ṭi melu maraduru vegirame
bagi vāyaguṁḍam̐gānĕ parā kĕ ṭṭaidivirā

(||magavāri||)
āgĕ vilisī naṁṭā naṭṭĕ vichchesevu gāni
paigŏni mā yiṁṭigi rām̐ bābamā nīgu
yīgaḍa nem̐ jūḍam̐gānĕ yiṁchugaṁta daya lega
kaigŏni tosi vichcheyam̐ gāḽlĕṭlāḍĕrā

(||magavāri||)
alladi vachchī naṁṭā akkaḍa sūsevu gāni
vŏllanĕ māmŏga maide vŏchchamā nīgu
tŏlliḍidānanĕ nīdŏḍamīm̐dam̐ baṁḍuṁḍam̐ga
mallaḍi yaṁtadavvu nī mana sĕṭṭu vārĕrā

(||magavāri||)
maṁtana madi yāḍam̐ga marim̐ jĕ vŏggevu gāni
kŏṁta nāmāḍa viṁṭe kŏradā nīvu
sĕṁtala śhrīveṁkaḍeśha sĕppam̐gā nannum̐ gūḍidi
vaṁtalonĕ nīguṇamu a dĕṭṭu dirigĕrā