మగవారయినవారు మగరీతినుంట గాక
(॥పల్లవి॥)
మగవారయినవారు మగరీతినుంట గాక
పగటులు మించి వలపక్షాలకు వత్తురా
(॥॥)
ఆపే నేనూ వాదించఁగా నడ్డాలు వచ్చేవు నీవు
కాపాడే నీపొందులిందు గాన వచ్చెనా
చెపట్టినవాఁడ నంటా సిగ్గులు విడిచి నీవు
యీ పనులకు వత్తురా యిందరు నవ్వేరు
(॥॥)
తగవు లిద్దరమును తమితోఁ దేరుచుకోఁగా
తెగి మాట వొరగులు దిద్దవచ్చేవు
మిగులా మోహింతునంటా మేరలు మీరి నీవు
అగడుకు లోనౌదురా అందురు నవ్వేరు
(॥॥)
సవతులము మాలోన సమ్మతించొక్కటి గాఁగ
కవతో నడుమ మమ్ముఁ గాఁగిలించేవు
తవిలి శ్రీవేంకటేశ తత్తరించి కూడితివి
యివల నీసుద్దులకు నిందరు నవ్వేరు
(||pallavi||)
magavārayinavāru magarīdinuṁṭa gāga
pagaḍulu miṁchi valabakṣhālagu vatturā
(||||)
ābe nenū vādiṁcham̐gā naḍḍālu vachchevu nīvu
kābāḍe nībŏṁduliṁdu gāna vachchĕnā
sĕbaṭṭinavām̐ḍa naṁṭā siggulu viḍisi nīvu
yī panulagu vatturā yiṁdaru navveru
(||||)
tagavu liddaramunu tamidom̐ derusugom̐gā
tĕgi māḍa vŏragulu diddavachchevu
migulā mohiṁtunaṁṭā meralu mīri nīvu
agaḍugu lonaudurā aṁduru navveru
(||||)
savadulamu mālona sammadiṁchŏkkaḍi gām̐ga
kavado naḍuma mammum̐ gām̐giliṁchevu
tavili śhrīveṁkaḍeśha tattariṁchi kūḍidivi
yivala nīsuddulagu niṁdaru navveru