Magavaanidonela mamdemelaalu

మగవానితోనేల మందెమేళాలు
Language

(॥పల్లవి॥)
మగవానితోనేల మందెమేళాలు
సొగసి యిచ్చకములే చూపవలెఁ గాక

(॥మగ॥)
చేతులెత్తి మొక్కితేను చిత్తము గరఁగుగాక
యేతులకు జంకించితే నితవులౌనా
నీతితోడ మాటాడితే నిలుచుఁగాక మోహము
పోతరించి పలికితే పొందు లొన గూడునా

(॥మగ॥)
నగుతాఁ గొసరితే ననుపులు వుట్టుఁగాక
బిగిసి వూరకుండితే ప్రియములౌనా
మొగమోట గలిగితే ముచ్చట లీడేరుఁగాక
యెగ సక్కేలైతేను ఇంపులౌనా రతులు

(॥మగ॥)
గట్టిగాఁ గాఁగిలించితే కళలు దైవారుఁగాక
వట్టి సిగ్గున నుంటే కైవసము లౌనా
యిట్టే శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నింతలోనే
నెట్టన నిటు గాకున్న నేరుపులు మించునా

(||pallavi||)
magavānidonela maṁdĕmeḽālu
sŏgasi yichchagamule sūbavalĕm̐ gāga

(||maga||)
sedulĕtti mŏkkidenu sittamu garam̐gugāga
yedulagu jaṁkiṁchide nidavulaunā
nīdidoḍa māḍāḍide nilusum̐gāga mohamu
podariṁchi paligide pŏṁdu lŏna gūḍunā

(||maga||)
nagudām̐ gŏsaride nanubulu vuṭṭum̐gāga
bigisi vūraguṁḍide priyamulaunā
mŏgamoḍa galigide muchchaḍa līḍerum̐gāga
yĕga sakkelaidenu iṁpulaunā radulu

(||maga||)
gaṭṭigām̐ gām̐giliṁchide kaḽalu daivārum̐gāga
vaṭṭi sigguna nuṁṭe kaivasamu launā
yiṭṭe śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu niṁtalone
nĕṭṭana niḍu gāgunna nerubulu miṁchunā