Magavaanido nimta mamku galadaa

మగవానితో నింత మంకు గలదా
Language

(॥పల్లవి॥)
మగవానితో నింత మంకు గలదా
వొగరులు మానవే వోయమ్మ నీవు

(॥మగ॥)
వారివీరిమీఁదఁ బెట్టి వల్లెవాటుఁబయ్యదతో
వేరెవేరేనేరుపుల వెఁగెమాడేవు
నీరమణుఁ డానలెల్లా నీతోఁ బెట్టుకొనీ
వూరకుండఁబట్టదటె వొయమ్మ నీకు

(॥మగ॥)
పొరుగుకాంతలఁ జూపి పొందుగాఁ జేతులువట్టి
తరవు వారిపైఁ దోసి తమిరేఁచేవు
గరిమ నాతఁడై తేను గక్కన నిన్ను ముట్టీని
వొరయ నంతయేఁటికే వొయమ్మ నీకు

(॥మగ॥)
మేరమీరి వూడిగపువారిమీఁద నింద గట్టి
గారవించిఅతనినే కాఁగిలించేవు
ఆరయ దూరదురటె అట్టె శ్రీవేంకటేశ్వరు
వూరటలేక కూడి వోయమ్మ నీవు

(||pallavi||)
magavānido niṁta maṁku galadā
vŏgarulu mānave voyamma nīvu

(||maga||)
vārivīrimīm̐dam̐ bĕṭṭi vallĕvāḍum̐bayyadado
verĕverenerubula vĕm̐gĕmāḍevu
nīramaṇum̐ ḍānalĕllā nīdom̐ bĕṭṭugŏnī
vūraguṁḍam̐baṭṭadaḍĕ vŏyamma nīgu

(||maga||)
pŏrugugāṁtalam̐ jūbi pŏṁdugām̐ jeduluvaṭṭi
taravu vāribaim̐ dosi tamirem̐sevu
garima nādam̐ḍai tenu gakkana ninnu muṭṭīni
vŏraya naṁtayem̐ṭige vŏyamma nīgu

(||maga||)
meramīri vūḍigabuvārimīm̐da niṁda gaṭṭi
gāraviṁchiadanine kām̐giliṁchevu
āraya dūraduraḍĕ aṭṭĕ śhrīveṁkaḍeśhvaru
vūraḍalega kūḍi voyamma nīvu